Harish Rao: సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ అలాగే గులాబీ పార్టీల మధ్య గొడవలు నెలకొన్నాయి. రుణమాఫీ విషయంలో హరీష్ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పూర్తిస్థాయిలో తెలంగాణ రాష్ట్ర రైతులకు రుణమాఫీ కాలేదని… హరీష్ రావు రాజీనామా చేసే సమస్య లేదని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. Harish Rao
By-elections in Harish Rao Siddipet constituency
ఈ తరుణంలోనే సిద్దిపేట గులాబీ పార్టీ కార్యాలయం పైన కాంగ్రెస్ నేతలు దాడి చేయడం జరిగింది. దీనికి కౌంటర్ ఇస్తూ… కాంగ్రెస్ నేతలకు గులాబీ నేతలు వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటలో పర్యటించారు. Harish Rao
Also Read: KCR: తెలంగాణ గవర్నర్ గా కేసీఆర్… కేంద్ర మంత్రిగా కేటీఆర్, హరీష్ కు?
ఈ సందర్భంగా.. మాజీ మంత్రి హరీష్ రావుకు మరో సవాల్ విసిరారు మైనంపల్లి హనుమంతరావు. ముందుగా చెప్పినట్లుగా… హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. ఒకవేళ సిద్దిపేట ఎమ్మెల్యేగా హరీష్ రావు రాజీనామా చేస్తే… ఉప ఎన్నికలు రావడం ఖాయం అన్నారు. Harish Rao
ఉప ఎన్నికల్లో హరీష్ రావు పైన తాను పోటీ చేస్తానని మైనంపల్లి సవాల్ విసిరారు. ఒకవేళ ఆ ఉప ఎన్నికల్లో హరీష్ రావు పైన తాను ఓడిపోతే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని మైనంపల్లి చెప్పడం జరిగింది. అయితే ఈ కౌంటర్ పై గులాబీ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. Harish Rao