Abhishek Bachchan: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్ తో విడాకులు తీసుకుంది అంటూ గత కొంతకాలంగా అనేక వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ వార్తలు మరి ఎక్కువ అవ్వడంతో అభిషేక్ బచ్చన్ అండ్ ఐశ్వర్య రాయ్లా అభిమానులు కూడా ఒకంత బాధకు గురయ్యారు. అయితే ఇటీవల విరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ రూమర్స్ వచ్చిన ప్రతిసారి ఈ జంట కలిసి కనిపించి అందరి నోట్లు మూయించారు.
Finally Abhishek Bachchan reacts on divorce
అయినప్పటికీ వీరి విడాకుల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా అభిషేక్ బచ్చన్ తన విడాకుల వార్తలపై స్పందిస్తూ అవును మేము నిజంగానే విడాకులు తీసుకున్నాం అంటూ మాట్లాడడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన మాట్లాడుతూ..” మా విడాకులు నిజమే. ఈ విషయం చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. మరి ఆ తరువాత మేము చేసుకోబోయే పెళ్లి గురించి కూడా మీరే చెప్పండి.
Also Read: Jyothi: వాళ్ల కోరిక తీర్చలేదని నాపై పగబట్టారు.. పేర్లతో సహా బయట పెట్టిన నటి జ్యోతి.?
ఐశ్వర్య కు నాకు జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలి ఎలా బ్రతకాలి అనేది పూర్తిగా తెలుసు. ఎవరో ఒక మూడో వ్యక్తి మా జీవితంలోకి వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకు ఐశ్వర్య పై ఎంత ప్రేమ ఉందో ఆమెకు తెలుసు. ఆమెకు నాపై ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. మీకు అందరికీ నచ్చేలా ఉండాలంటే ఉండలేం. మీ అందరిని ఇంప్రెస్ చేస్తూ ఉండాలంటే మేము ఉండలేము.
![Finally Abhishek Bachchan reacts on divorce](https://telugu.pakkafilmy.com/wp-content/uploads/2024/06/aishwarya-rai-bachchan-and-abhishek-bachchan-1024x538.jpg)
![Finally Abhishek Bachchan reacts on divorce](https://telugu.pakkafilmy.com/wp-content/uploads/2024/06/aishwarya-rai-bachchan-and-abhishek-bachchan-1024x538.jpg)
అలాగే మీడియా వాళ్ళు చెప్పే దాని మీదనే నా లైఫ్ నడవాలి అంటే నడవదు. నా పర్సనల్ లైఫ్ నాకు ఉంటుంది. మీడియాలో వచ్చిన రూమర్స్ నేను పట్టించుకోను. అందుకే విడాకుల రూమర్స్ పై ప్రతిసారి స్పందించలేను ” అంటూ తన విడాకుల వార్తలపై ఖండించాడు అభిషేక్ బచ్చన్. ప్రెసెంట్ ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Abhishek Bachchan)