Prashanth: సౌత్ స్టార్ హీరోగా ఒకప్పుడు ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన హీరోలలో ప్రశాంత్ కూడా ఉంటారు. ఆయన జీన్స్ సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. జీన్స్ మూవీ లో ప్రశాంత్ నటనకి సౌత్ ప్రేక్షకులే కాదు నార్త్ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. అయితే అలాంటి ప్రశాంత్ ప్రస్తుతం సినిమాల్లో అంత యాక్టివ్ గా లేరు.. ఒకప్పుడు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసే ఈ హీరో ప్రస్తుతం ఏడాదికి ఒక్క సినిమాతో సరిపెట్టుకుంటున్నారు.
Remarriage with a married girl..The dark side of Prashanth life
ప్రశాంత్ నటించిన అంధగాన్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఇక ఈ సినిమా కి సంబంధించిన ఓ ఈవెంట్లో ప్రశాంత్ తండ్రి డైరెక్టర్ త్యాగరాజన్ మాట్లాడుతూ.. నా కొడుకు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు.. అమ్మాయి దొరికిన వెంటనే మీకు ఈ విషయం చెబుతామంటూ గుడ్ న్యూస్ చెప్పారు త్యాగరాజన్..అయితే ప్రశాంత్ కి ప్రస్తుతం 51 ఏళ్లు.. (Prashanth)
Also Read: Prabhas: ప్రభాస్ లేకుండా ఆ సినిమాని ఊహించుకోలేం.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..!!
ఆయన మొదట గృహలక్ష్మి అనే అమ్మాయిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు.. వీరికి ఒక బాబు కూడా పుట్టారు.కానీ అనూహ్యంగా వీరిద్దరి విడాకులు జరిగాయి.అయితే అప్పట్లో వీరి పెళ్లి విడాకులు పెద్ద సెన్సేషన్ అయ్యింది. ఎందుకంటే గృహలక్ష్మికి అప్పటికే పెళ్లయిపోయింది. కానీ ఈ విషయం దాచిపెట్టి ప్రశాంత్ ని పెళ్లి చేసుకుంది.
ఇక పెళ్లయ్యాక కొడుకు పుట్టాక గృహలక్ష్మి మొదటి భర్త గృహలక్ష్మి నా భార్య అని రావడంతో ఈ విషయం కాస్త బయటపడింది. దాంతో ప్రశాంత్ ఈ విషయాన్ని జీర్ణించుకోలేక తన భార్యకు విడాకులు ఇచ్చాడు.ఇక అప్పటినుండి ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ప్రశాంత్ 51 ఏళ్లలో మళ్ళీ రెండో పెళ్లికి సిద్ధమయ్యారు.(Prashanth)