Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి నారా లోకేష్ దూకుడుగా ముందుకు వెళుతున్నారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన నారా లోకేష్… ఏకంగా రెండు పదవులను దక్కించుకున్నారు. విద్యాశాఖ అలాగే ఐటీ శాఖ మంత్రిగా దూకుడుగా పనిచేస్తున్నారు నారా లోకేష్. Nara Lokesh

Key post for Kendra Nara Lokesh

ఈ రెండు శాఖల్లో జరిగిన అవినీతి అక్రమాలను బయటకు తీస్తూనే… ఏపీ అభివృద్ధికి తోడ్పాటు అవుతున్నారు మంత్రి నారా లోకేష్. ఇలాంటి సమయంలో మంత్రి నారా లోకేష్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి బంపర్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్రంలో… మంత్రి నారా లోకేష్ కు కీలక పదవి ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధమైందట. Nara Lokesh

Also Read: Ramoji Rao: గన్నవరం ఎయిర్ పోర్టుకు రామోజీరావు పేరు ?

అందుకే బుధవారం రోజున హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారట మంత్రి నారా లోకేష్. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు కుటుంబాన్ని మచ్చిక చేసుకోవడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. Nara Lokesh

ఇందులో భాగంగానే తాజాగా నారా లోకేష్ ను ఢిల్లీకి పిలిపించుకుందట కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా ఎన్డీఏ పెద్దలతో ఆ పదవిపై… నారా లోకేష్ కూడా చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు చెబుతున్నారు. Nara Lokesh