Allu Arjun: అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీకి గత కొద్దిరోజుల నుండి దూరం పెరిగింది.వీరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది అనే రూమర్ కూడా మీడియాలో వినిపిస్తోంది. అయితే ఈ రూమర్స్ వినిపిస్తున్న వేళ తాజాగా మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమాకి సంబంధించిన ఈవెంట్లో పాల్గొన్న అల్లు అర్జున్ నేను ఎక్కడికైనా వెళ్తా..ఎవరికైనా సపోర్ట్ చేస్తా అంటూ మాట్లాడిన మాటలు ఇండస్ట్రీలో కాక రేపుతున్నాయి.మరి ఇంతకీ అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
Allu Arjun: I will support anyone I like.. What is your problem
మెగా ఫ్యామిలీ నుండి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి జనసేన పార్టీ ద్వారా ఈసారి ఎన్నికల్లో సక్సెస్ అయ్యారు.అయితే ఈ ఎన్నికల్లో పవన్ తరుపున ప్రచారం చేయడానికి ఎంతోమంది సినీ సెలబ్రిటీలు వచ్చారు కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. కానీ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి కాకుండా వైసిపి అభ్యర్థి తన ఫ్రెండ్ శిల్పా రావిచంద్ర రెడ్డి కి సపోర్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా వీరి మధ్య ఉన్న గొడవలు భగ్గుమన్నాయి. ఆ తర్వాత నాగబాబు చేసిన ట్వీట్ అల్లు అర్జున్ అభిమానులు చేసిన రచ్చ పవన్ కళ్యాణ్ పరోక్షంగా అల్లు అర్జున్ పై చేసిన కామెంట్లు ఇలా ఎన్నో వీరి మధ్య విభేదాలు నిజమేనడానికి ఉదాహరణగా నిలిచాయి. (Allu Arjun)
Also Read: Venu Swamy: రష్మికకు చేసిన పూజ అలాంటిదా .. లైవ్ లో బయటపడ్డ వేణి స్వామి నిజ స్వరూపం..?
అయితే తాజాగా అల్లు అర్జున్ మారుతి నగర్ సుబ్రమణ్యం అనే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఈ ఈవెంట్లో బన్నీ మాట్లాడుతూ.. మనకు ఇష్టమైన వాళ్ళ కోసం ఎక్కడికైనా వెళతాం..అలా నేను కూడా నాకు ఇష్టమైన వాళ్ళ కోసం ఏదైనా చేస్తా.ఎక్కడికైనా వెళ్తా నా మనసుకు నచ్చితే నేను కచ్చితంగా వస్తా ఎందుకంటే అది చూపించాలి. ఇక తబిత (అంటే సుకుమార్ భార్య) నాకు ఫోన్ చేసి ఈ ఈవెంట్ కి రమ్మని చెప్పింది.కానీ నేను అప్పటికే పుష్ప-2 సినిమాకి సంబంధించి క్లైమాక్స్ షూటింగ్ లో ఉన్నాను.
అయితే అది మోస్ట్ డిఫికల్ క్లైమాక్స్.. దాంతో రాలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పాను.అయినప్పటికీ తబిత మాత్రం నిన్ను పిలవకుండా ఇంకా ఎవరిని పిలుస్తాను.నువ్వు రాకుండా ఇంకెవరు వస్తారు అంటూ ఆప్యాయంగా పిలిచింది.దాంతో రానని చెప్పలేక వచ్చేసాను. ఫ్రెండ్స్ కోసం నాకు ఇష్టమైన వాళ్లకోసం ఎక్కడికైనా వస్తాను అని అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ గా మారాయి.అయితే ఈ మాటలు పరోక్షంగా మెగా ఫ్యామిలీని ఉద్దేశించే మాట్లాడారని కొంతమంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.(Allu Arjun)