The man who ran and hit Chiranjeevi near the theatre

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఈరోజుతో 69వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు.ఆయన తన 69వ బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.అలాగే మెగా ఫ్యాన్స్ కూడా చిరంజీవి బర్త్డే రోజు పండగ వాతావరణంలా దేశవ్యాప్తంగా సంబరాలు చేస్తున్నారు.ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి బర్త్డే కాబట్టి ఆయనకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి.

The man who ran and hit Chiranjeevi near the theatre

అలా తాజాగా ఓ విషయం మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.అదేంటంటే అంత పెద్ద హీరో అయినా చిరంజీవిని థియేటర్ దగ్గర ఓ పెద్దాయన పరిగెత్తించుకుంటూ మరీ కొట్టారట. ఇక ఆయన ఎవరో కాదు చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట రావు.. అయితే చిరంజీవిని రోడ్డు మీద పరిగెత్తించుకుంటూ కొట్టడానికి కారణం సినిమా థియేటర్ దగ్గరికి రావడమే..ఇక అసలు విషయం ఏమిటంటే..(Chiranjeevi)

Also Read: Aishwarya Rai: ఆ హీరోని ఐశ్వర్య సీక్రెట్ గా పెళ్లాడిందా.. అక్కడికి హనీమూన్ కి కూడా ..?

చిరంజీవి తన 13 ఏళ్ల వయసులో తన తమ్ముడు నాగబాబును తీసుకొని సీనియర్ ఎన్టీఆర్ నటించిన రాము అనే సినిమాకి వచ్చారట.అయితే ఆ మూవీ ఆరోజే విడుదలవ్వడంతో థియేటర్ దగ్గర జనాల తొక్కిసలాట జరిగింది. ఇక ఈ సినిమాకి ఎలాగోలా టికెట్లు పట్టి సినిమా చూశారు. ఇక ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాకి చిరంజీవి తండ్రి కూడా వచ్చారు. అయితే చిరంజీవిని నాగబాబుని ఎక్కడ చూసారో ఏమో తెలియదు

 The man who ran and hit Chiranjeevi near the theatre

కానీ సినిమా అయిపోయాక బయటికి రావడంతోనే అక్కడే ఉన్న కొబ్బరి మట్టలు విరిగేలా చిరంజీవిని రోడ్డుపై పరిగెత్తించి మరీ కొట్టారట.దానికి కారణం అప్పటికీ చిరంజీవి ఏజ్ 13 ఏళ్లేనట.ఇక ఆ టైంలో నాగబాబు వయసు ఎంతుంటుందో అర్థం చేసుకోవచ్చు.అయితే అంత చిన్న పిల్లవాడిని వెంటేసుకొని నువ్వు సినిమా చూడడానికి వచ్చావా.. ఈ జనాల తొక్కీసలాటలో మీ ఇద్దరికీ ఏమైనా అయితే ఏం చేస్తావ్ అని కొబ్బరి మట్ట విరిగేలా కొట్టారట. అయితే ఈ విషయాన్ని చిరంజీవి ఓ ఈవెంట్లో బయట పెట్టారు. అంతేకాదు ఇప్పటికీ ఏవీఎం రాము సినిమా గుర్తుకు వస్తే చిరంజీవికి నాగబాబుకి ఒంట్లో వణుకు పుడుతుందట.(Chiranjeevi)