Chiranjeevi vs Balakrishna 2024, Chiranjeevi Balakrishna clash news, Chiranjeevi vs Balakrishna movie comparison, Chiranjeevi Balakrishna upcoming films, Chiranjeevi vs Balakrishna box office, Chiranjeevi Balakrishna film rivalry, Chiranjeevi Balakrishna mega clash, Chiranjeevi Balakrishna film release dates, Chiranjeevi vs Balakrishna movie reviews, Chiranjeevi Balakrishna industry impact,

Chiranjeevi: నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిల మధ్య ఒకప్పుడు ఎంతటి స్థాయిలో పోటీ ఉండేదో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే వారి పోటీ తత్వం సినిమాల వరకే ఉండేది. ఆ తర్వాత ఇద్దరు మంచి స్నేహితులుగా కూడా ఉన్నారు. చాలాసార్లు పలు వేదికలలో వీరు ఎంత ఆప్త మిత్రులో ప్రజలకు చాటి చెప్పారు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నందమూరి బాలకృష్ణ తన మిత్రుడైన చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా గురించి మాట్లాడి మంచితనాన్ని చాటుకున్నాడు.

Chiranjeevi vs Balakrishna: A Mega Clash in the Making?

తనకు పరిశ్రమలో ఉన్న అతి తక్కువ మంది మిత్రులలో చిరంజీవి ముందు వరుసలో ఉంటారని ఆయనతో చాలా విషయాలు పంచుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ గెస్ట్ గా రావడం అప్పట్లో సెన్సేషన్ అయింది. ఏదేమైనా చాలాసార్లు వీరు ఒకేసారి తమ సినిమాలను విడుదల చేసి ఒకరిపై ఒకరు పై చేయి సాధించుకున్నారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ వీరిద్దరికి మంచి విజయాలను తీసుకువస్తుందని చెప్పాలి. ఆ సమయంలో వీరు దాదాపు చాలా సినిమాలను కలిసి విడుదల చేశారు. ఒకసారి ఒకరు విజయం సాధిస్తే మరొకసారి మరొకరు విజయాన్ని సాధించేవారు. గతేడాది వాల్తేరు వీరయ్య తో చిరు, వీర సింహ రెడ్డి తో బాలయ్య సంక్రాంతికి వక్చిహ్ ఇద్దరు సక్సెస్ సాధించుకున్నారు.

Also Read: Trisha Krishnan: తెలుగు లో త్రిష జోరు.. వరుస ఆఫర్లతో బిజీ!!

ఆ విధంగా వీరిద్దరి మధ్య పోటీ మరొకసారి చూసే అవకాశం దక్కుతుందని చెప్పాలి. ప్రస్తుతం వారు నటిస్తున్న సినిమాలు ఒకేసారి విడుదల కాబోతున్నాయని అర్థమవుతుంది. అది కూడా సంక్రాంతి సందర్భంగా వీరి సినిమాలు రాబోతున్నాయట. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ‘విశ్వంభర’ చిత్రం సంక్రాంతి కానుక గానే రాబోతుంది అని మేకర్స్ ఈరోజే ఎనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ కూడా తన 109వ సినిమాను సంక్రాంతి కానుకగానే తీసుకురావాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ చిత్రానికి బాబి దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే గతంలోలా ఇప్పుడు ఒకేసారి పెద్ద సినిమాలు విడుదలయితే ఇండస్ట్రీకి నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెద్ద సినిమాలు ఒకేసారి రావడం కొంత ఇబ్బందిని కలిగించే వ్యవహారం. కాబట్టి వీరిద్దరిలో ఎవరైనా వెనక్కి తగ్గుతారో చూడాలి. వీరి సినిమాలే కాకుండా విక్టరీ వెంకటేష్ హీరోగా నటించే అనిల్ రావిపూడి సినిమా అలాగే రవితేజ హీరోగా నటిస్తున్న ఓ కొత్త సినిమా కూడా సంక్రాంతికి విడుదల కాబోతున్నాయి. నాగార్జున ఇప్పటి వరకైతే బరిలో లేరు కానీ ఆయన కుబేర సినిమా సంక్రాంతికి వస్తే మాత్రం వేరే లెవెల్ లో వార్ ఉంటుందని చెప్పాలి.