Meenakshi and BhagyaSri in High Demand

Meenakshi Vs BhagyaSri: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఓ ఇద్దరు హీరోయిన్ లకు వరుస సినిమా అవకాశాలు దక్కుతున్నాయని చెప్పాలి. ‘ఇచట వాహనములు నిలపరాదు’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి ఇప్పుడు తెలుగులో వరుస సినిమా అవకాశాలను అందుకుంటుంది. ఇప్పటికే వెంకటేష్ హీరోగా నటిస్తున్న అనిల్ రావిపూడి సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంపిక కాగా పలువురు యువ హీరోలు కూడా ఈమెను తమ సినిమాలలో పెట్టుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

Meenakshi and BhagyaSri in High Demand

ఆ విధంగా ఈమె నటించిన సినిమాలు విడుదలయితే తప్పకుండా భారీ స్థాయిలో ఆమెకు అవకాశాలు రావడం ఖాయం అని చెప్పాలి. ఈమెతో పాటు మరో హీరోయిన్ కూడా వరుస సినిమా అవకాశాలను అందుకోవడానికి సిద్ధమయ్యింది. రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన భాగ్యశ్రీ బోర్సే పై ఇప్పుడు అందరి చూపు ఉందని చెప్పాలి. ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోయినా కూడా ఈమెకు మంచి మార్కులు పడ్డాయి. ఆమె లుక్స్ కి నటనకి ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయిపోయారు. ముఖ్యంగా డ్యాన్సులతో ప్రతి ఒక్కరని ఆమె ఆకట్టుకుంది.

Also Read: Rashmika Mandanna: వారిద్దరి మధ్య నేషనల్ క్రష్ రష్మిక నలిగిపోతుందా..!!

ఆ విధంగా భాగ్యశ్రీ తో కలిసి నటించాలని ప్రతి ఒక్క హీరో భావిస్తున్న నేపథ్యంలో ఆమె ఎలాంటి సినిమాలను ఒప్పుకుంటుందో చూడాలి. ఈ లెక్కన చూస్తే వీళ్లిద్దరి మధ్య పోటీ భారీ స్థాయిలో ఉంటుందని చెప్పాలి. అంతకుముందు కృతి శెట్టి శ్రీ లీల ఇద్దరు కూడా వరుస సినిమా అవకాశాలను అందుకోగా వారి సినిమాల ఎంపికలో లోపాల వల్ల ఇప్పుడు దాదాపుగా వారి కెరియర్ ముగించుకోవలసి వచ్చిందనే చెప్పాలి. వారిలా కాకుండా స్కోప్ ఉన్న సినిమాను ఎంపిక చేసుకొని ముందుకు వెళితే బాగుంటుంది అని వారి వారి అభిమానులు చెబుతున్నారు.

ఏదేమైనా ఈ ఇద్దరి హీరోయిన్లు కూడా ఇప్పటివరకు మంచి మంచి సినిమాలు చేస్తూనే వచ్చారు. ప్రేక్షకులను అలరిస్తూనే వచ్చారు. మరి వారు ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో చూడాలి.