Prabhas: దర్శకుడు హను రాఘవపూడి తో కలిసి ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కొత్త హీరోయిన్ ఇమాన్వీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఎంతో ఘనంగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమంలో ఇమాన్వీ హైలైట్ గా నిలిచింది. ఇదే సమయంలో ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా విడుదల చేసి సినిమా పట్ల అంచనాలను కూడా ఇప్పటినుంచి పెంచేశాడు దర్శకుడు.

Prabhas’ Upcoming Historical Film: Concept Poster and Story Clarity

ఈ పోస్టర్ లో మూడు ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా దర్శకుడు పొందుపరిచాడు. కోల్కతా బ్రిడ్జి, సుభాష్ చంద్రబోస్ హింద్ పతాకం, హైదరాబాద్ చార్మినార్ వంటి వాటిని చూపించారు. దీంతో ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటా అనే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించసాగారు. ఇన్ని విషయాలను ఏ విధంగా డీల్ చేస్తారో అని అందరిలో ఈ సినిమా పట్ల అంచనాలు పెరిగిపోయాయి. 1940 బ్యాక్ గ్రౌండ్ లో ఈ సినిమా చేయబోతున్నట్లుగా కాన్సెప్ట్ పోస్టర్ చెబుతుంది. మరి రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన కథ గురించి పలు రకాల వార్తలు రాగా వాటన్నిటికీ భిన్నంగా ఇప్పుడు హను ఈ సినిమాను రూపొందించబోతున్నాడని చెప్పవచ్చు.

Also Read: Saripodhaa Shanivaram: నాని ఊపిరాడని ప్రమోషన్.. శనివారం కు సరిపోయేనా!!

తాజాగా ఆయన కూడా ఈ సినిమా యొక్క కథ పై వస్తున్న పుకార్ల గురించి ఓ క్లారిటీ తీసుకొచ్చారు. పలు రకాల ఆధారిత కథలు రాసుకున్నాన వాటిలో ప్రభాస్ తో చేస్తున్న సినిమా కథ వేరేనని అన్నారు. ఇది తాజాగా వచ్చిన ఐడియా అని ఆయన చెప్పారు. గతంలో తాను అనుకున్న కథలకు ఈ కథకు ఎలాంటి సంబంధం లేదని ఆయన వెల్లడించారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా దాదాపుగా 300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రంతెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ సినిమా యొక్క కథపై అందరిలో రూమన్స్ క్లియర్ అవడంతో ఈ చిత్రం ఎలా ఉంటుందో అని ప్రభాస్ అభిమానులు ఇప్పటినుంచి ఎదురుచూస్తున్నారు మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.