Megha Akash who is ready for marriage.. Secret engagement

Megha Akash: ఏంటి మేఘా ఆకాష్ నిజంగానే పెళ్ళికి రెడీ అయిందా..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ లో నిజం ఉందా అనేది ఇప్పుడు చూద్దాం.. లై, ఛల్ మోహన్ రంగ, రాజరాజ చోర,డియర్ మేఘ ,రావణాసుర, గుర్తుందా శీతాకాలం వంటి ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన మేఘా ఆకాష్ తాజాగా పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. అయితే మేఘా ఆకాష్ తన ప్రియుడు సాయి విష్ణుతో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది.

Megha Akash who is ready for marriage.. Secret engagement

తాజాగా ఈ ముద్దుగుమ్మ సాయి విష్ణు అనే అబ్బాయి తో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫోటోలు మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ మేఘా ఆకాష్ పెళ్లికి రెడీ అయిందని, అభిమానులకు చెప్పకుండానే ఎంగేజ్మెంట్ చేసుకుందని కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఎంగేజ్మెంట్ అయిపోయాక అభిమానులతో ఈ ఫొటోస్ ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకోవడంతో ఈమె సీక్రెట్ ఎంగేజ్మెంట్ బయటపడింది. (Megha Akash)

Also Read: Prabhas: డార్లింగ్ తో హను ఎలాంటి సినిమా చేస్తున్నాడో చెప్పకనే చెప్పాడుగా!!

అయితే చాలా రోజులుగా మేఘా ఆకాష్ తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ నాయకుడి కొడుకుని పెళ్లాడబోతున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి.కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు అనేలా తాజాగా ఈ ముద్దుగుమ్మ సాయి విష్ణు అనే అబ్బాయి తో ఎంగేజ్మెంట్ చేసుకుంది.అంతేకాకుండా మేఘా ఆకాష్ షేర్ చేసిన ఫోటోస్ ని చూస్తే వీళ్లిద్దరి మధ్య ఆరు సంవత్సరాలుగా రిలేషన్ ఉన్నట్టు తెలుస్తోంది.

Megha Akash who is ready for marriage.. Secret engagement

అయితే ఈ విషయాన్ని మేఘా ఆకాష్ తన పోస్టుల్లో రాసుకువచ్చింది.. ఆరు సంవత్సరాలు లవ్ లో ఉన్న జంట ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ ద్వారా ఒక్కటయ్యారు. ఇక త్వరలోనే ఈ జంట పెళ్లి కాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మేఘా ఆకాష్ సాయి విష్ణుల జంటకి ఎంతోమంది సినీ సెలబ్రిటీలు నెటిజన్స్, అభిమానులు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక మేఘా ఆకాష్ పెళ్లాడబోయే సాయి విష్ణు బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియాల్సి ఉంది.(Megha Akash)