Raghurama Raju: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. 164 స్థానాలు సంపాదించుకున్న తెలుగుదేశం కూటమి… అఖండ మెజారిటీతో అధికారాన్ని దక్కించుకుంది. ఇలాంటి నేపథ్యంలోనే… చంద్రబాబు నాయుడు నాలుగో సారి ముఖ్యమంత్రి అయ్యారు. అటు ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్నారు. Raghurama Raju
Raghurama rebellion against Chandrababu
అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ… ఎంతో ఆశగా తెలుగుదేశం పార్టీలో చేరిన రఘురామకృష్ణ రాజు పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. చంద్రబాబు కంటే జగన్మోహన్ రెడ్డి పై ఎక్కువ పోరాటం చేసింది రఘురామరాజు అని కొంతమంది చెబుతూ ఉంటారు. Raghurama Raju
Also Read: Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీని.. ఏపీకి తరలించేందుకు కుట్రలు?
వైసిపి పార్టీలోనే ఉంటూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అనేక కేసులు వేశారు రఘురామకృష్ణరాజు. అయితే.. ఎన్నికల కంటే ముందు టిడిపిలో చేరిన రఘురామ కృష్ణరాజు…. ఉండి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అదే సమయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. Raghurama Raju
దీంతో ఏపీ కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కుతుందని రఘురామకృష్ణరాజు భావించారు. కానీ ఆయన ఆశలు నీరుగారాయి. అంతేకాదు… టీటీడీ పాలక మండలి చైర్మన్ పదవి కూడా రఘురామకృష్ణ రాజుకు వస్తుందని అందరూ అనుకున్నారు. ఆ పదవి కూడా.. టీవీ5 నాయుడు కు ఇవ్వబోతున్నారని స్పష్టమవుతోంది. ఇక నామినేటెడ్ పోస్టుల్లో ఏదైనా ఒక పోస్టు రాకపోతే.. రఘురామకృష్ణరాజు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. Raghurama Raju