Rohit Sharma: ఐపీఎల్ 2025 సీజన్ కోసం కీలక నిర్ణయం తీసుకుంది ముంబై ఇండియన్స్. జట్టు సారథ్య బాధ్యతలను మళ్లీ రోహిత్ శర్మకు అప్పగించేందుకు సిద్ధమైందట. ఐపిఎల్ 2025 సీజన్-2 మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ కి నిర్ణయం తీసుకున్నట్టు అనేక రకాలుగా వార్తలు వస్తున్నాయి. Rohit Sharma
Ambani came down Huge sketch for Rohit Sharma
ఐపీఎల్ 2024 సీజన్ తరుణంలో తమ కెప్టెన్ ను మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ముంబై ఇండియన్స్. గుజరాత్ టైటాన్స్ సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ విండో ద్వారా జట్టులోకి తెచ్చుకొని సారథ్య బాధ్యతలను అప్పగించింది. జట్టుకు ఐదు టైటిల్స్ ను అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది. జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని క్లారిటీ ఇచ్చింది.Rohit Sharma
Also Read: KL Rahul: క్రికెట్ కు రాహుల్ గుడ్ బై.. కొత్త వ్యాపారంలోకి జంప్ …?
ఈ నిర్ణయం ముంబై ఇండియన్స్ కొంపముంచింది. కెప్టెన్సీ మార్పును ఆ జట్టులోని ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు. హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా అంగీకరించలేకపోయింది. సూర్య కుమార్ యాదవ్, జస్ప్రీత్ బూమ్రా, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు బహిరంగంగానే ఈ నిర్ణయంతో తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. Rohit Sharma
ఇక ఈ ఏడాది చివర్లో ఐపీఎల్ వేలం జరగనుంది. ఈ నేపథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ రోహిత్ శర్మ కోసం ఈ విధంగా రూ. 50 కోట్లు సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే రోహిత్ శర్మను వదులుకుంటే తమ బ్రాండ్ వాల్యూ పడిపోతుందని గ్రహించిన ముంబై ఇండియన్స్ బుజ్జగింపు చర్యలు మొదలుపెట్టిందని, తిరిగి కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని జట్టు వర్గాలు పేర్కొన్నాయి. Rohit Sharma