Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ దారుణంగా ఓడిపోయిన నేపథ్యంలో… వైసీపీని పట్టించుకునే నాధుడే కనిపించడం లేదు. కీలక నేతలందరూ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ దూకేందుకు చూస్తున్నారు. Jagan
Mopidevi Venkataramana Big Shock To YSRCP jagan
ఇక రాజ్యసభ సభ్యులు ఇతర ఎంపీలు కూడా ఛాన్స్ వస్తే మరో పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే దొరబాబు, ఆళ్ల నాని , ఇతర చాలామంది నేతలు ఇప్పటికే వైసీపీ పార్టీకి దూరమయ్యారు. ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి మరో ఎదురు దెబ్బ తగిలింది. Jagan
Also Read: YCP: బాలీవుడ్ హీరోయిన్ ను వేధిస్తున్న వైసీపీ నేతలు ?
జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వైసిపి పార్టీకి రాజీనామా చేసే యువచనలో రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఏపీలో వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారట రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ. Jagan
అదే సమయంలో మోపిదేవి వెంకటరమణ టిడిపి టచ్ లోకి వెళ్లినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తాజాగా మంత్రి అనగానే సత్యప్రసాద్ తో కూడా మోపిదేవి సమావేశమయ్యారట. రేపు లేదా ఇవాళ.. వైసీపీ పార్టీకి మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే టిడిపి పార్టీలోకి ఆయన చేరుతారని చెబుతున్నారు. Jagan