IPL 2025: మరికొన్ని నెలల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫ్రాంచైజీలన్నీ రిటైర్డ్ ప్లేయర్ల జాబితాపై దృష్టి పెడుతున్నాయి. ఈ క్రమంలో ఆర్సిబి తమ కెప్టెన్ డుప్లెసిస్ తో సహా స్టార్ ఆటగాళ్లని సైతం విడిచిపెట్టి కొత్త జట్టును ఏర్పాటు చేయాలని భావిస్తోంది. IPL 2025
IPL 2025 These are the players that RCB will give up
సౌత్ ఆఫ్రికా బ్యాటర్ డుప్లెసిస్ కు గుడ్ బై చెప్పాలని ఆర్సిబి నిర్ణయించుకుందట. ఐపీఎల్ లో డుప్లెసిస్ కు అపారమైన అనుభవం ఉంది. 40 ఏళ్ల డుప్లెసిస్ స్థానంలో యువకుడికి అవకాశం ఇవ్వాలని, కొత్త వ్యక్తికి కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని ఆర్సిబి ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకుందని సమాచారం. IPL 2025
Also Read: IPL 2025: సన్ రైజర్స్ హైదరాబాద్ లోకి తిలక్ వర్మ…భారీ ధరకు కొనుగోలు ?
మ్యాక్స్వెల్ ను వదులుకోవాలని ఆర్సిబి నిర్ణయం తీసుకుందట. 2021లో ఆర్సిబిలోకి వచ్చిన మ్యాక్సీ ఆ సీజన్ లో 513 పరుగులతో అందరినీ ఆకట్టుకున్నాడు. మ్యాక్సీని వదులుకోవడానికి మరో కారణం యువ ఆల్రౌండర్ విల్ జాక్స్ మెరుగైన ప్రదర్శన చేయడమే కారణంగా తెలుస్తోంది. IPL 2025
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ ను ఆర్సిబి వదులుకోవాలని నిర్ణయం తీసుకుంది. గ్రీన్ గేమ్ చేంజర్ గా మారతాడని….ముంబై ఇండియన్స్ నుంచి బెంగళూరు ట్రేడ్ చేసుకుంది. కానీ రూ. 17.50 కోట్లు విలువైన గ్రీన్ అంచనాలను అందుకోలేకపోయాడు. IPL 2025