Kriti Shetty: కృతి శెట్టి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నది ఎవరు? ఆమె వెనక నిజంగానే కుట్రలు జరుగుతున్నాయా.. కృతి శెట్టి అలా ఎందుకు మాట్లాడింది..ఆమె మాటలు వెనుక ఉన్న అర్థం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. ఉప్పెన సినిమా ద్వారా స్టార్ స్టేటస్ సంపాదించిన కృతి శెట్టి సినిమాలు ఫ్లాప్ అవ్వాలని ఇండస్ట్రీలోని ఓవర్గం వాళ్ళు గట్టిగా కోరుకున్నారట.అయితే ఈ విషయం తనకు కూడా తెలుసని,తాజాగా ఓ ఇంటర్వ్యూలో కృతి శెట్టి బయట పెట్టింది.
Who is the person conspiring to ruin Kriti Shetty life
ఉప్పెన సినిమా ఫ్లాప్ అయితే బాగుండు మనం ఆ అమ్మాయిని వేలెత్తి చూపిద్దామని ఎంతోమంది ఎదురు చూశారు. కానీ ఆ అవకాశం రాలేదు. ఇక ఆ తర్వాత నేను నటించిన సినిమాలు కూడా హిట్ అవ్వడంతో ఆ వర్గం వాళ్లకి నా మీద మరింత కసి పెరిగింది.. ఎప్పుడెప్పుడు నా సినిమాలు ఫ్లాప్ అవుతాయా అని ఎదురు చూశా.రు కానీ ఆ తర్వాత నేను నటించిన సినిమాలు ప్లాప్ అయినా కూడా నాకు పెద్దగా ఎఫెక్ట్ పడలేదు.(Kriti Shetty)
Also Read: Heroine: పెళ్లయిన హీరోలతో చిరంజీవి హీరోయిన్ ఎఫైర్.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా అంతమందా.?
ఎందుకంటే నేను నా సినిమాలు హిట్ అయినప్పుడు పొంగి పోలేదు. ఆ క్రెడిట్ పూర్తిగా నాదే అని చెప్పుకోలేదు. అలాగే ఫ్లాప్ అయిన సమయంలో కూడా నావల్ల ఫ్లాఫ్ అయింది అని అనుకోలేదు. అందుకే నన్ను ఎవరు టార్గెట్ చేయడానికి అవకాశం దొరకలేదు.. అయితే నా సినిమాలు డిజాస్టర్ అయితే వాటినుండి నేను ఎన్నో నేర్చుకోగలిగాను.
ముఖ్యంగా సినిమాలు హిట్ అయిన వాటికంటే ఫ్లాప్ అయినా సినిమాల నుండే ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. నా ఫ్లాప్ అయిన సినిమాల ద్వారా నా తప్పులు తెల్సుకొని వాటిని నెక్స్ట్ సినిమాల్లో సరిదిద్దుకుంటున్నాను అంటూ కృతి శెట్టి చెప్పుకు వచ్చింది.దీంతో కృత్తి శెట్టి సినిమాలు ప్లాప్ అవ్వాలని కోరుకున్నది ఎవరు? ఆమె ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసింది అని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు.(Kriti Shetty)