Ramya Krishnan is so angry with that heroine

Ramya Krishnan: సీనియర్ బ్యూటీ రమ్యకృష్ణ కి ఇప్పటికీ సినిమాల్లో వరుస అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు సినిమాల్లో వరుస అవకాశాలు రావడమే కాదు రెమ్యూనరేషన్ విషయంలో కూడా తగ్గేదేలే అంటుంది. ఎందుకంటే ఆమె ఒక్కరోజు రెమ్యూనరేషన్ దాదాపు పది లక్షలకు పైగానే అని తెలుస్తుంది. అలా ఎన్ని రోజులు షూటింగ్ ఉంటే అన్ని పది లక్షలు తీసుకుంటుందట. అయితే అలాంటి ఈ బ్యూటీ వయసు పెరుగుతున్నా కూడా వన్నె తిరగని అందంతో ఇప్పటికీ పాతికేళ్ళ యువతి లాగే ఉంటుంది.

Ramya Krishnan is so angry with that heroine

ఓవైపు సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తూనే మరోవైపు వ్యాపార ప్రకటనల్లో కూడా రాణిస్తూ రెండు చేతుల సంపాదిస్తోంది. ఇక రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాక బాహుబలి లోని శివగామి పాత్ర ఆమెకు ఎనలేని క్రేజ్ తెచ్చి పెట్టింది.ఈ పాత్ర ఆమె సినీ కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్ అని చెప్పుకోవచ్చు. ఇక హీరోయిన్ గా అలరించిన రమ్యకృష్ణ నెగటివ్ పాత్రల్లో చేసిన మూవీస్ నరసింహ, నీలాంబరి వంటివి ఉన్నాయి.(Ramya Krishnan)

Also Read: Heroine: సునీల్ హీరోయిన్ సీక్రెట్ ఎఫై**.. స్టార్ హీరోతో అర్ధరాత్రి రిసార్ట్ కి..?

ఇక ఈ సినిమాల్లో నరసింహ సినిమా రమ్యకృష్ణ కి మంచి పేరు తెచ్చింది. ఈ సినిమాలో రమ్యకృష్ణ విలనిజానికి చాలామంది లేడీ విలన్స్ కూడా ఆశ్చర్యపోయారట. ఒక హీరోయిన్ ఇంత విలనిజాన్ని కూడా పండించగలదా అని. అయితే అలాంటి రమ్యకృష్ణ కి సౌందర్య అంటే పగా అని అప్పట్లో ఓ టాక్ వినిపించింది. దానికి ప్రధాన కారణం ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన పవిత్ర బంధం సినిమాలో మొదట వెంకటేష్ సరసన రమ్యకృష్ణ ని హీరోయిన్ గా అనుకున్నారట.

Ramya Krishnan is so angry with that heroine

కానీ ఆ తర్వాత డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య రమ్యకృష్ణ ని తీసేసి వెంకటేష్ హిట్ పెయిర్ అయినటువంటి సౌందర్య ని తీసుకున్నారట.దాంతో తన అవకాశాన్ని లాగేసుకున్నందుకు రమ్యకృష్ణ సౌందర్య పై పీకల్లోతు కోపం పెంచుకుంది అనే టాక్ ఫీలింగ్ సర్కిల్స్లో వినిపించింది. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు ఎందుకంటే వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్.(Ramya Krishnan)