Balakrishna: నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు ఇండస్ట్రీలోని కొంతమంది ప్రముఖులు.. ఇండస్ట్రీలో ఉన్న కొంత మంది ప్రముఖులు కలిసి ఇప్పటికే ఎంతోమందికి బాలయ్య 50 ఏళ్ల సినీ ఈవెంట్ కి సంబంధించిన ఆహ్వానాలు అందించారు. అలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి, అమితాబ్ బచ్చన్, అల్లు అర్జున్ లతో పాటు మెగా ఫ్యామిలీ లోని అందరికీ ఈ ఆహ్వానం అందింది.
Has Balakrishna harbored so much grudge against those heroes
అలాగే ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోయిన్లకు,హీరోలకు కూడా ఈ ఆహ్వానం అందింది. ఇప్పటికే టాప్ సెలబ్రిటీలకు ఆహ్వానం అందిస్తూ ఫోటోలు దిగి నెట్టింట వాటిని షేర్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ఈవెంట్ కి ఆహ్వానం అందుతుంది. కానీ ఆ ఇద్దరు అన్నదమ్ములకు మాత్రం ఇప్పటివరకు ఆహ్వానం అందలేదు. ఇక వాళ్ళు ఎవరో కాదు నందమూరి కళ్యాణ్ రామ్,జూనియర్ ఎన్టీఆర్..(Balakrishna)
Also Read: Ramya Krishnan: రమ్యకృష్ణ కి ఆ హీరోయిన్ మీద అంత పగా..?
గత కొద్ది రోజులుగా బాలకృష్ణ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తో మాట్లాడట్లేదు. ఏదైనా ఈవెంట్లో కనిపించిన కూడా వాళ్ళను కనీసం పలకరించడం లేదు.దీంతో నందమూరి ఫ్యామిలీలో ఉన్న విభేదాలు అందరికీ కళ్ళకికట్టినట్లుగా కనిపిస్తున్నాయి. అయితే 50 ఏళ్ల సినీ ఈవెంట్ తో నందమూరి ఫ్యామిలీలో ఎంత సఖ్యత ఉంది అనేది బయటపడుతుంది అని ఇప్పటికే అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఈవెంట్ కి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ లకి ఆహ్వానం అందితే ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు అని అనుకోవచ్చు.
కానీ ఒకవేళ వీరికి ఆహ్వానం అందకపోతే నిజంగానే బాలకృష్ణ ఆ ఇద్దరిని దూరం పెట్టినట్టు అర్థం చేసుకోవచ్చు అంటున్నారు కొంతమందిని నెటిజన్స్. ఏది ఏమైనప్పటికి సెప్టెంబర్ 1న బాలకృష్ణ 50 ఏళ్ల సినీ వేడుక జరగబోతుంది.అయితే ఇంకా రెండు రోజులు సమయం మాత్రమే ఉంది. ఈ రెండు రోజుల్లో ఆ ఇద్దరి హీరోలకు ఆహ్వానం అందితే సరే లేకపోతే బాలకృష్ణ ఆ ఇద్దరు హీరోలను దూరం పెట్టినట్టు క్లారిటీ వస్తుంది.(Balakrishna)