Rakul Preet Singh who fell in love with that young hero

Rakul Preet Singh: ఏంటి రకుల్ ప్రీత్ సింగ్ కి ఆ హీరో అంటే అంత ఇష్టమా.. ఆయన నా డార్లింగ్ అంటూ ఎందుకు ఆ ఈవెంట్ లో మాట్లాడింది.ఇంతకీ రకుల్ డార్లింగ్ అని పిలిచింది ఏ హీరోని అనేది ఇప్పుడు చూద్దాం.. రకుల్ ప్రీత్ సింగ్ కి ప్రస్తుతం తెలుగులో ఏమాత్రం అవకాశాలు లేవు.ప్రస్తుతం బాలీవుడ్ లోనే ఈ ముద్దుగుమ్మ రాణిస్తోంది. అయితే ఈమె తెలుగులో నటించకపోయినప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

Rakul Preet Singh who fell in love with that young hero

కెరటం మూవీతో తన సినీ ప్రస్థానాన్ని టాలీవుడ్ లో మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.అలా ధ్రువ,నాన్నకు ప్రేమతో,సరైనోడు,లౌక్యం, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, కరెంటు తీగ వంటి సినిమాల్లో నటించింది.ఇక చివరిగా ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా వచ్చిన కమల్ హాసన్ భారతీయుడు -2 మూవీలో సిద్ధార్థ్ కి జోడిగా నటించింది.(Rakul Preet Singh)

Also Read: Tamannaah: తమన్నా ప్రైవేట్ ఫొటోస్ తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న ప్రియుడు..?

అయితే అలాంటి ఈ హీరోయిన్ అక్కినేని అఖిల్ ని నా డార్లింగ్ అంటూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ అటు నాగార్జునతో మన్మధుడు-2, నాగచైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాం వంటి సినిమాల్లో నటించింది. ఇక అక్కినేని అఖిల్ తో కూడా నటిస్తే ఈమె వాళ్ళ ఫ్యామిలీలోని ముగ్గురు హీరోలతో నటించిన హీరోయిన్ గా పేరు తెచ్చుకునేది.

Rakul Preet Singh who fell in love with that young hero

కానీ సడన్గా రకుల్ ఓ ఇంటర్వ్యూలో అఖిల్ నా డార్లింగ్..ఆయన కి నా తమ్ముడు వయసు ఉంటుంది అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. దీంతో ఈమె మాటలు విన్న కొంతమంది నెటిజన్స్ అఖిల్ తో సినిమా చేస్తుంది అనుకుంటే తమ్ముడు అనేసింది ఏంటి అని షాక్ అయ్యారు. అయితే రకుల్ ఈ మాటలు ఇప్పుడు మాట్లాడినవైతే కావు.(Rakul Preet Singh)