YCP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో వైసీపీ పార్టీ నుంచి చాలామంది నేతలు దూరమవుతున్నారు. అధికారం కోల్పోయిన నేపథ్యంలో జగన్ పైన నమ్మకం కోల్పోయిన నేతలు… జారుకుంటున్నారు. ఈ తరుణంలోనే గురువారం రోజున… వైసీపీ పార్టీకి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి వెంకటరమణ మరియు బీద మస్తాన్ రావులు రాజీనామా చేశారు. YCP
Rajya Sabha chance for those two in place of Beda and Mopidevi
నేరుగా ఢిల్లీకి వెళ్లిన మోపిదేవి వెంకటరమణ మరియు బీద మస్తాన్ రావు… తమ రాజీనామా పత్రాలను రాజ్యసభ చైర్మన్కు అప్పగించారు. దీనిపై వెంటనే స్పందించిన రాజ్యసభ చైర్మన్… వారి రాజీనామాలకు ఆమోదం తెలిపారు. దీంతో ఏపీ నుంచి రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. YCP
Also Read: Bollywood: చంద్రబాబు భారీ స్కెచ్…విజయవాడకు రహస్యంగా బాలీవుడ్ హీరోయిన్?
ప్రస్తుతం ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం తెలుగుదేశం కూటమి ఆ రెండు రాజ్యసభ సీట్లను దక్కించుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం కూటమి నుంచి… ఇద్దరికీ అవకాశం రాబోతుంది. ఈ లిస్టులో టిడిపి నుంచి గల్లా జయదేవ్ కు ఛాన్స్ ఇవ్వనున్నారట. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయని గల్లా జయదేవ్… ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ స్థానంలో రాజ్యసభకు వెళ్తున్నారని సమాచారం. YCP
ఇక బీద మస్తాన్ రావు స్థానంలో జనసేన పార్టీకి అవకాశం ఇవ్వనుంది. ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బ్రదర్ నాగబాబు రాజ్యసభకు వెళ్లే ఛాన్స్ ఉందని సమాచారం. ఆయన మొన్నటి ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. దీంతో నాగబాబుకు ఆ సీటు కన్ఫామ్ అయినట్లు సమాచారం.