Casting couch in Tollywood too.. Samantha sensational comments

Samantha: ప్రస్తుతం మాలీవుడ్లో హేమ కమిటీ రిపోర్టు ఎంత సంచలనం సృష్టిస్తుందో చెప్పనక్కర్లేదు. ఇప్పటికే పలువురు నటీమణులు బయటికి వచ్చి తమకు ఎదురైన లైంగిక వేధింపులను బయట పెడుతున్నారు.అయితే హేమ కమిటీ రిపోర్ట్ కి చాలామంది మద్దతు పలుకుతున్నారు. కేవలం మాలీవుడ్ నటీమణులు, హీరోలు మాత్రమే కాకుండా ఇతర ఇండస్ట్రీల నటీ నటులు కూడా దీనికి సపోర్ట్ చేయడంతో మాలీవుడ్లో మరి కొంతమంది నటీమణులు తమకు జరిగిన విషయాలను బయట పెట్టడానికి ముందుకు వస్తున్నారు.

Casting couch in Tollywood too.. Samantha sensational comments

అయితే తాజాగా సమంత హేమ కమిటీ రిపోర్ట్ ని మెచ్చుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే కేవలం హాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ కి సంబంధించిన ఒక రిపోర్ట్ తెస్తే బాగుంటుందని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.తన ఇంస్టాగ్రామ్ వేదికగా టాలీవుడ్ లో కూడా లైంగిక వేధింపులపై గవర్నమెంట్ ఒక కమిటీ వేయాలి అంటూ సమంత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి సంచలన పోస్ట్ పెట్టింది.(Samantha)

Also Read: Pooja Hegde: ప్రియుడితో రహస్యంగా అక్కడికి వెళ్లిన పూజ హెగ్డే.. హోటల్లో ఆ పని చేస్తూ..?

చాలామంది క్యాస్టింగ్ కౌచ్ అనేది అన్ని ఇండస్ట్రీలో ఉంటుంది.అది తెలుగులో కూడా తెస్తే బాగుంటుంది.ఏ హీరోయిన్లు ఈ క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డారో ఎవరి నిజస్వరూపాలు ఎలాంటివో బయటపడతాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఏది ఏమైనప్పటికీ సమంత పెట్టిన పోస్ట్ కి మాత్రం చాలామంది అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా మద్దతు పలుకుతున్నారు. మరి చూడాలి మాలీవుడ్ లాగే మన టాలీవుడ్ లో కూడా లైంగిక వేధింపులపై ఏదైనా కమిటీ వేస్తారో లేదో..

Casting couch in Tollywood too.. Samantha sensational comments

అయితే చాలామంది ఇతర ఇండస్ట్రీలోని నటిమణులు అన్నింటికంటే తెలుగులో చాలా తక్కువ క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని ఇతర ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంటుంది అని అంటూ ఉంటారు.అయితే ఒకప్పుడు ఇలాంటివి ఉండేవి కానీ ప్రస్తుతం హీరోలు అందరూ అప్డేట్ చెందారు. టాలెంట్ ఉంటేనే అవకాశాలు ఇస్తున్నారు. కానీ సమాజంలో ఎక్కడ ఒక చోట చీడపురుగు ఉన్నట్టు తెలుగులో కూడా అక్కడక్కడ కొంతమంది దర్శకనిర్మాతలు కొత్తగా వచ్చేవారి నీ లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.(Samantha)