Naga Chaitanya: నాగచైతన్యకి తల్లి దగ్గుబాటి లక్ష్మీ రెండో పెళ్లి చేసుకోవడం నిజంగానే ఇష్టం లేదా..ఆమె రెండో పెళ్లి చేసుకుంటానంటే నాగచైతన్య అలాంటి పని చేశారా..ఇంతకీ నాగ చైతన్యకు తల్లి రెండో పెళ్లి చేసుకోవడం ఎందుకు ఇష్టం లేదో ఇప్పుడు చూద్దాం.. నాగచైతన్య తల్లి దగ్గుబాటి లక్ష్మి మొదట నాగార్జునని పెళ్లి చేసుకొని ఆ తర్వాత విభేదాల కారణంగా డివోర్స్ తీసుకొని విడిపోయింది.
Naga Chaitanya does not want his mother to marry a second time
ఇక విడాకుల తర్వాత నాగార్జున దారి నాగార్జున చూసుకున్నారు. లక్ష్మీ దారి లక్ష్మీ చూసుకున్నారు. అయితే దగ్గుబాటి రామానాయుడు కూతురు ఇంటి మీద ఎన్ని రోజులు ఉంటుంది అని భావించి ప్రముఖ శ్రీరామ్ మోటార్స్ సంస్థ అధినేత అయినటువంటి శరత్ విజయ్ రాఘవన్ కి ఇచ్చి తన కూతురికి రెండో పెళ్లి చేశారు. అయితే నాగచైతన్యకు విజయ్ రాఘవన్ రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అనే టాక్ అప్పట్లో వినిపించింది.(Naga Chaitanya)
Also Read: Ali: అమ్మాయితో అసభ్యంగా ఆ పని.. రౌడీలతో తన్నులు తిన్న కమెడియన్..?
కానీ ఇందులో అస్సలు నిజం లేదు.ఎందుకంటే దగ్గుబాటి లక్ష్మి కి పెళ్లి అయిన సమయంలో నాగచైతన్యకి అంత పెద్ద వయసు లేదు. చాలా చిన్నవాడు. అలాగే పెద్దయ్యాక నాగార్జునని ఎలా గౌరవించారో తన తల్లి రెండో భర్తను కూడా అలాగే తండ్రిలాగే గౌరవించారు.అంతేకాదు వారి ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్ కి నాగ చైతన్య హాజరవుతారు. అలా దగ్గుబాటి లక్ష్మీ రెండో భర్తతో పుట్టిన కొడుకు పెళ్లికి కూడా నాగచైతన్య హాజరైన సంగతి మనకు తెలిసిందే.
అంతే కాదు రీసెంట్గా నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ సమయంలో కూడా దగ్గుబాటి లక్ష్మి తన రెండో భర్త కొడుకు కోడలతో వీరి ఎంగేజ్మెంట్ వేడుకకు నాగార్జున ఇంటికి వచ్చింది. ఇక దగ్గుబాటి లక్ష్మీ నాగార్జున విడాకులు తీసుకున్నప్పటికీ ఇప్పటికీ ఫ్రెండ్లీగానే ఉంటారట.అంతేకాదు నాగచైతన్య తల్లిదండ్రులు ఇద్దరు విడిపోయిన కూడా నాగచైతన్య తన తల్లి దగ్గరే పెరిగారు.అలా హాలిడేస్ ఉన్న సమయంలో నాగార్జున దగ్గరికి వచ్చేవారు. ఇక నాగచైతన్యకి తల్లి రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు అది రూమర్ మాత్రమే.(Naga Chaitanya)