Pan card : ప్రస్తుతం పాన్ కార్డు వినియోగం ఎక్కువైంది. బ్యాంకింగ్ సంబంధిత పనుల కోసం పాన్ కార్డు కచ్చితంగా ఉండాలి 50వేలకు మించి లావాదేవులు చేయాలన్నా లోన్ తీసుకోవాలనా పాన్ కార్డు కచ్చితంగా ఉండాలి. అయితే ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే ఈ పాన్ కార్డులో కొన్నిసార్లు పేరు తప్పుగా పడుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. పాన్ కార్డులో పేరు తప్పు పడితే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం ఒక్కోసారి పేరు తప్పు పడుతూ ఉంటుంది. అటువంటి అప్పుడు మనం సరిచేసుకోవచ్చు ఇంట్లోనే ఉండి పాన్ కార్డులో పేరుని మార్చుకోవచ్చు.
Name changing in Pan card
ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందు అధికారిగా వెబ్సైట్లోకి వెళ్ళండి తర్వాత మీరు కరెక్షన్ అండ్ అప్లికేషన్ టైప్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ క్యాటగిరీని సెలెక్ట్ చేసుకునేది సమాచారాన్ని అందించాలి ఇందులో భాగంగా మీ పూర్తి పేరు పుట్టిన తేదీతో పాటుగా ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ పాన్ కార్డు నెంబర్ ని కూడా ఇచ్చేయాలి. క్యాప్ కూడా ఇచ్చేసి చూసి సబ్మిట్ చేయాలి వెంటనే కేవైసీ కోసం ఫిజికల్ లేదా డిజిటల్ సెలెక్ట్ చేయాలి. డిజిటల్ సెలెక్ట్ చేసుకుంటే ఆధార్ కార్డు ద్వారా ఈ కేవైసీ పూర్తవుతుంది. పాన్ కార్డు ఈకేవైసీ కోసం ఆదర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ పాన్ నెంబర్ను ఎంటర్ చేయాలి.
Also read: ‘ఎన్టీఆర్ – బాబీ డియోల్’లపై యాక్షన్ షెడ్యూల్
ఆ తర్వాత వివరాలను మార్చి పాన్ కార్డు ని ఎలా పొందాలి అనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవాలి ఆధార్ కార్డులోని చివరి 4 నెంబర్లను ఎంటర్ చేయండి. చివరిగా పేమెంట్ చేయండి చెల్లింపు పూర్తి అయిన తర్వాత కంటిన్యూ పైన నొక్కాలి. ఆ తర్వాత ఆధార్ తో లింక్ అయినా మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది ఓటీపీని ఎంటర్ చేస్తే ప్రక్రియ ముగుస్తుంది. నెలరోజుల్లోగా మీ పాన్ కార్డు మీ అడ్రస్ కి వస్తుంది (Pan card).