Balakrishna who threatened the director with a knife

Balakrishna: నందమూరి బాలకృష్ణ కు ఎంతమంది అభిమానులు ఉంటారో చెప్పనక్కర్లేదు. అయితే చాలామంది హీరోల అభిమానులు వాళ్ళ అభిమాన హీరో కనిపిస్తే సెల్ఫీలు దిగడానికి ముందుకు పరిగెత్తుకుంటూ వస్తారు. కానీ బాలకృష్ణతో సెల్ఫీలు దిగాలంటే ఆయన అభిమానులు భయపడిపోతుంటారు. ఎందుకంటే బాలకృష్ణ తన అభిమానులపై చాలాసార్లు చేయి చేసుకున్న ఘటనలు ఉన్నాయి.

Balakrishna who threatened the director with a knife

అందుకే అభిమానులు భయపడి పోతుంటారు. అయితే బాలకృష్ణ ఓ సినిమా షూటింగ్లోకి ఏకంగా కత్తి పట్టుకుని వెళ్లారట. అంతేకాదు డైరెక్టర్ ని కత్తితో బెదిరించారట కూడా.. మరి బాలకృష్ణ బెదిరించిన ఆ డైరెక్టర్ ఎవరో ఇప్పుడు చూద్దాం. నందమూరి బాలకృష్ణ కత్తితో బెదిరించింది ఎవరినో కాదు డైరెక్టర్ సుకుమార్ ని.. రీసెంట్ గా బాలకృష్ణ పుష్ప-2 సినిమా షూటింగ్ జరిగే లొకేషన్ కి వెళ్ళారట. (Balakrishna)

Also Read: Simran: సిమ్రాన్ మీద కోపంతో ప్రైవేట్ పార్ట్స్ చూపించిన స్టార్ నటి.. ఎవరంటే..?

అయితే ఆ టైంలో ఆయన ఒక యాడ్ లో నటిస్తున్నారట. దాంతో పక్కనే ఉన్న షూటింగ్ దగ్గరికి కత్తి పట్టుకుని వెళ్లారట. అల్లు అర్జున్ తో మొదట మాట్లాడి ఆ తర్వాత సుకుమార్ తో మాట్లాడే సమయంలో కత్తి చూపించి బెదిరించారట. ఏంటండీ అలా కత్తి తీస్తున్నారు అని సుకుమార్ అడగగా..మీరు అన్ స్టాపబుల్ షోకి వచ్చినప్పుడు మూన్నెళ్లలో మీతో సినిమా చేస్తానని నాకు మాట ఇచ్చారు.

Balakrishna who threatened the director with a knife

మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి.. నాతో సినిమా చేస్తావా.. లేక కత్తికి పని చెప్పనా అంటూ బాలకృష్ణ సుకుమార్ ని సరదాగా ఆటపట్టించారట.ఇక ఆ టైంలో షూటింగ్ సెట్లో ఉన్న వాళ్ళందరూ నవ్వుకున్నారట. ఇక ఈ విషయాన్ని తాజాగా బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టారు.(Balakrishna)