Lavanya Sensational comments on Shekhar bhasha

Lavanya: హీరో రాజ్ తరుణ్ లావణ్య మధ్య వివాదం గత కొద్దిరోజుల నుండి చల్లబడింది. అయితే వీరిద్దరి వివాదంలోకి శేఖర్ భాషా ఎంట్రీ ఇచ్చి లావణ్యను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. అంతేకాదు ఆమెతో చెప్పు దెబ్బలు కూడా తిన్నాడు. అలాగే లావణ్య అందరి జీవితాలు నాశనం చేసింది అంటూ కొంతమందిని మీడియా ముందుకు కూడా పట్టుకోచ్చారు. అయితే ప్రస్తుతం ఆయన బిగ్ బాస్ షో కి వచ్చారు.కాబట్టి ఇదంతా పబ్లిసిటీ స్టంట్ కోసమే చేశారని,బిగ్ బాస్ లో ఫేమస్ అవ్వాలని ముందునుండే ఇలా రాజ్ తరుణ్ వ్యవహారంలో ఈయన కలగ జేసుకున్నారని తెలుస్తోంది.

Lavanya Sensational comments on Shekhar bhasha

అయితే ఇదే విషయంపై లావణ్య తాజాగా మాట్లాడుతూ.. శేఖర్ భాషా చేసిన పని వల్ల ముగ్గురు అమ్మాయిలు సూసైడ్ చేసుకోబోయారు. ఆయనకు రాజ్ కు ఎలాంటి సంబంధం లేదు. కానీ కావాలనే ఫేమస్ అవ్వడం కోసం అలా రాజ్ తరుణ్ ఫ్రెండ్ అని చెప్పుకొని ఆయన దగ్గర కొన్ని ఇన్ఫర్మేషన్లు తెలుసుకొని అలాగే నా గురించి నా సన్నిహితులకు ఫోన్లు చేసి మరీ అడిగారు. కానీ వాళ్లు మొదట్లో నా విషయాలు చెప్పకపోయినప్పటికీ డబ్బు ఆశ చూపి నా గురించి నెగటివ్ గా చెప్పమని శేఖర్ బాషా అందరికీ చెప్పారు. (Lavanya )

Also Read: Balakrishna: ఆ డైరెక్టర్ ని కత్తితో బెదిరించిన బాలకృష్ణ..?

అలాగే నా ఇంటి విషయంలో కూడా లాయర్ తో మాట్లాడుకొని రాజ్ తరుణ్ దగ్గర కోటి రూపాయలు తీసుకొని నన్ను ఇంటి నుండి బయటకు వెళ్లగొట్టేలా తప్పుడు ప్రచారం చేశారు. అలాగే రాజ్ తరుణ్ తో నేను గొడవపడ్డ సమయంలో కూడా కేవలం నా మాటలు మాత్రమే రికార్డ్ చేసి రాజ్ మాటలు వదిలేశారు.దాంతో నన్ను మీడియాలో నెగిటివ్గా చిత్రీకరించారు.

Lavanya Sensational comments on Shekhar bhasha

ఇక వీటన్నింటిని చూస్తే శేఖర్ భాష కేవలం బిగ్ బాస్ ఆఫర్ రావడం వల్ల అందులోకి వెళ్తే పబ్లిసిటీ రావాలి కాబట్టే నన్ను ఇలా వాడుకున్నాడు. ఇప్పటికైనా శేఖర్ భాష నిజస్వరూపం బయటపడింది.ఆయనకు ఎవరు ఓట్లు వేయకండి.మొదటి వారంలోనే బయటికి పంపించాలి అంటూ లావణ్య షాకింగ్ కామెంట్లు చేసింది.(Lavanya )