Balakrishna: Did I remove Sridevi from the film because I didn't need it

Balakrishna: నందమూరి బాలకృష్ణ దివంగత నటి శ్రీదేవి కాంబినేషన్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో రెండు మూడు సినిమాలు అనుకున్నారు కానీ కొన్ని కారణాలవల్ల ఇద్దరిని జోడిగా పెట్టి సినిమా తీయలేదు అనే టాక్ ఉంది.అయితే నందమూరి బాలకృష్ణ తండ్రి సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవితో పదులకొద్దీ సినిమాల్లో నటించారు. దాంతో తండ్రి శ్రీదేవితో నటించకూడదు అని బాలకృష్ణకి కండిషన్ పెట్టడం వల్లే శ్రీదేవితో ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా బాలకృష్ణ రిజెక్ట్ చేశారనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.

Balakrishna: Did I remove Sridevi from the film because I didn’t need it

అయితే ఇదే విషయంపై బాలకృష్ణని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో అడగగా.. బాలకృష్ణ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.బాలకృష్ణని యాంకర్ మీరెందుకు శ్రీదేవిని మీ సినిమాలో ఒక్కసారి కూడా తీసుకోలేదు అని అడగగా.. ఇందులో వేరే ఉద్దేశం ఏదీ లేదు. యాదృచ్ఛికంగా అలా జరిగిపోయింది.అలాగే చాలా రీమేక్ సినిమాల్లో శ్రీదేవిని తీసుకోవాల్సి వస్తే వద్దని చెప్పేసాను. ఎందుకంటే ఆమె అవసరం లేదనిపించింది. (Balakrishna)

Also Read: Aamani: ఆ పార్ట్ పై మచ్చ.. బట్టలు పూర్తిగా విప్పి చూపించమన్న డైరెక్టర్.?

అయితే ఆమె అందం లేదు నటన రాదు అని కాదు.కొన్ని కొన్ని పాత్రలు కొంతమంది హీరోయిన్లకు మాత్రమే సెట్ అవుతాయి. అందుకే అలాంటి రీమేక్ సినిమాల్లో శ్రీదేవి సెట్ అవ్వదని అనిపించింది. అందుకోసమే శ్రీదేవితో సినిమా ఆఫర్స్ వచ్చినా కూడా వద్దని చెప్పేశాను. అలాగే నేను నా సినిమాలో చేసే ప్రతి ఆర్టిస్ట్ ని ముందుగా ఆలోచించి తీసుకుంటాను.

Balakrishna: Did I remove Sridevi from the film because I didn't need it

నా సినిమాలో హీరోయిన్ పాత్ర ఎవరికైతే సెట్ అవుతుందో వారిని తీసుకోమని చెబుతాను. అందుకే మా ఇద్దరిమధ్య కాంబినేషన్ సెట్ అవ్వదు అనిపించింది. ఈ కారణంతోనే శ్రీదేవిని నా ఒక్క సినిమాలో కూడా తీసుకోలేదు అంటూ బాలకృష్ణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.(Balakrishna)