Anushka: బాలీవుడ్లో సంచలనం సృష్టించిన హేమ కమిటీ రిపోర్ట్ కి ఇప్పటికే ఎంతోమంది మద్దతు తెలుపుతున్నారు. ఇందులో కేవలం మాలివుడ్ సినీ సెలబ్రిటీలే కాదు సౌత్ సెలబ్రెటీలందరూ కూడా హేమ కమిటీ రిపోర్ట్ ని మెచ్చుకుంటున్నారు.అయితే హేమ కమిటీ రిపోర్ట్ ని మెచ్చుకుంటూ సమంత తెలుగులో కూడా ఇలాంటి ఒక కమిటీ తీసుకురావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక పోస్ట్ పెట్టింది.
Hema Committee in Tollywood too Anushka sensational comments
అయితే సమంత పెట్టిన పోస్ట్ ప్రస్తుతం టాలీవుడ్లో సంచలనం సృష్టిస్తోంది. అంత పెద్ద హీరోయిన్ టాలీవుడ్ లో కూడా క్యాస్టింగ్ కౌచ్ జరుగుతుందని పరోక్షంగా చెప్పి టాలీవుడ్ లో కూడా కమిటీ తీసుకురావాలంటే ఎలా అర్థం చేసుకోవాలని ఎంతోమంది గుసగుసలు పెట్టుకుంటున్నారు. అయితే సమంత పెట్టిన పోస్ట్ కి అనుష్క సైతం మద్దతు తెలుపుతూ నిజంగానే తెలుగులో కూడా ఇలాంటి ఒక కమిటీని తీసుకురావాలి అని పోస్ట్ పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.(Anushka)
Also Read: Simran: సిమ్రాన్ మీద కోపంతో ప్రైవేట్ పార్ట్స్ చూపించిన స్టార్ నటి.. ఎవరంటే..?
సమంతే అనుకుంటే ఆమెకి తోడు అనుష్క కూడా కమిటీ తీసుకురావాలని చెప్పింది.అంటే నిజంగానే టాలీవుడ్ లో బయటికి తెలియని ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయా అంటూ చాలామంది నెటిజన్స్ భావిస్తున్నారు. అయితే అనుష్క కూడా తెలుగులో క్యాస్టింగ్ కౌచ్ కి సంబంధించి కమిటీ తీసుకురావాలని మాట్లాడంతో అనుష్క గురించి ఒక రూమర్ వినిపిస్తోంది.
అదేంటంటే.. అనుష్క ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తెలుగులో కొన్ని అవకాశాలు వచ్చాయి.ఆ టైంలో ఓ స్టార్ డైరెక్టర్ అనుష్కని పడక సుఖం తీర్చమని అడిగాడని,అందుకే సమంతకి మద్దతుగా అనుష్క కూడా ఇలాంటి ఒక కమిటీని తెలుగులో తీసుకువస్తే బాగుంటుందని పోస్ట్ పెట్టి ఉంటుందని పలువురు నెటిజన్స్ భావిస్తున్నారు. మరి మాలీవుడ్ లాగే టాలీవుడ్ లో కూడా ఇలాంటి ఓ కమిటీని తీసుకువస్తారా అనేది చూడాలి.(Anushka)