Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ నారా, నందమూరి ఫ్యామిలీ లకు ఎంత దగ్గర అవ్వాలని చూస్తున్నా కూడా ఆ రెండు ఫ్యామిలీలు ఈయన్నీ దూరమే పెడుతున్నాయి. ఈయన ఫ్యామిలీ తో అనుబంధం కోసం పది అడుగులు ముందుకు వేస్తే వాళ్ళు మాత్రం ఈయనను ఇరవై అడుగులు వెనక్కి తోస్తున్నారు. అయితే టిడిపి ఆంధ్రాలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన సమయంలో ఎన్టీఆర్ అందర్నీ విష్ చేశారు.
Chandrababu conspiracy on Jr.NTR
అయినా కూడా ఆయన్ని దూరం పెడుతున్నారు. రీసెంట్గా జరిగిన బాలకృష్ణ 50 ఏళ్ల సినీ వేడుకకు కూడా బాలకృష్ణ, కళ్యాణ్‌రామ్, ఎన్టీఆర్ లను ఆహ్వానించలేదు. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఎలాంటిదో అందరికీ అర్థమయిపోయింది. అయితే తాజాగా ఎన్టీఆర్ దేవర సినిమాకి ఏపీ టీడీపీ కూటమి ప్రభుత్వం పెద్ద షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.(Jr.NTR)
Also Read: Jr. NTR: Jr.ఎన్టీఆర్ కి మనశ్శాంతిని దూరం చేసిన బాలకృష్ణ 50 ఏళ్ల సినీ వేడుక.?
అయితే టాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న రూమర్ ఏంటంటే.. దేవర సినిమాకి టిడిపి కూటమి టికెట్స్ రేట్లు పెంచుతుందో లేదో అనే ఒక అనుమానం ఎన్టీఆర్ అభిమానుల్లో ఉంది. ఒకవేళ టికెట్ రేట్లు పెంచకపోతే మాత్రం దేవరకి పెద్ద మైనస్ అవుతుందని తెలుస్తోంది.మరి చంద్రబాబు ఎన్టీఆర్ దేవర సినిమాకి టికెట్ రేట్లు పెంచి తమ మధ్య ఎలాంటి గొడవ లేవు అని పరోక్షంగా నైనా బయట పెడతారా..
లేదా టికెట్ రేట్లు పెంచకుండా నిజంగానే తమ మధ్య గొడవ ఉంది అని అందరికీ తెలిసేలా చేస్తారా అనేది చూడాలి. ఏది ఏమైనప్పటికీ తాజాగా బాలకృష్ణ సినీ ఈవెంట్ కి పిలవకుండా ఎన్టీఆర్ కి ఒక షాక్ తగిలితే దేవర సినిమాకి టికెట్ రెట్లు పెంచకపోతే మరో షాక్ కూడా తగులుతుంది. ఇలా ఓకే నెలలో నారా నందమూరి ఫ్యామిలీల నుండి ఎన్టీఆర్ కి డబుల్ షాక్ తగలబోతున్నట్టు తెలుస్తోంది.(Jr.NTR)