Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే… నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం కూటమికి ఎంతో సహాయ పడ్డ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు… డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వాస్తవానికి ఏపీ హోమ్ మినిస్టర్ పదవి అలాగే ఆర్థిక శాఖ మంత్రి పదవి జనసేనకు ఇవ్వాల్సి ఉంది. Pawan Kalyan

Chandrababu Naidu backstab Pawan Kalyan


కానీ అలాంటి కీలక శాఖలు పవన్ కళ్యాణ్ పార్టీకి ఇవ్వకుండా… తెలుగుదేశం పార్టీ నేతలకే ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీలలో కూడా… ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీ నేతలకే వస్తుందని సమాచారం అందుతుంది ఇలాంటి నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మరోసారి సీఎం చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచేలా కనిపిస్తోంది. Pawan Kalyan

Also Read: KCR: కేసీఆర్ కోసం రంగంలోకి దిగుతున్న సునీల్ కనుగోలు?

వారం రోజుల కిందట వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ మరియు మస్తాన్ రావు ఇద్దరు తమ రాజ్యసభ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఆ రెండు రాజ్యసభ పదవులను తెలుగుదేశం కూటమి మాత్రమే దక్కించుకోగలుగుతుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో జనసేనకు ఒకటి అలాగే తెలుగుదేశం కు మరొకటి… లెక్క ప్రకారం ఇవ్వాలి. Pawan Kalyan

కానీ ఆ రెండు రాజ్యసభ పదవులను తెలుగుదేశం పార్టీకే ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నుతున్నారట. ఆ రెండు రాజ్యసభ పదవులను యనమల అలాగే అశోక్ గజపతి రాజుకు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్కెచ్ వేశారట. ఒకవేళ ఇదే జరిగితే నాగబాబుకు మరోసారి పదవి రానట్లే అని జనసేన పార్టీ నేతలు అనుకుంటున్నారు. చంద్రబాబును నమ్ముకుంటే నట్టేట ముంచేలా కనిపిస్తున్నాడని ఫైర్ అవుతున్నారు జనసేన నేతలు. Pawan Kalyan