Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ మహా నగరాన్ని వరదలు ముంచెత్తాయి. శనివారం రాత్రి నుంచి.. కురిసిన వర్షాలతో.. కృష్ణానది పక్కన ఉన్న విజయవాడ నగరం మొత్తం మునిగిపోయింది. దీంతో చాలామంది నిరాశ్రయులు అయ్యారు. Pawan Kalyan

Pawan Kalyan IS MISSING AP PEOPLE SERIOUS

చాలామందికి ఆహారం అలాగే మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. అయితే ఇలాంటి నేపథ్యంలో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతులెత్తేశారు. జనాలు వరదల్లో మునుగుతున్న నేపథ్యంలో… వారిని కాపాడేందుకు విజయవాడ మాత్రం రాలేదు పవన్ కళ్యాణ్. Pawan Kalyan

ALSO READ: Revanth Reddy: రేవంత్ రెడ్డి కొంపముంచిన చంద్రబాబు.. ముసలోడే కానీ మహానుభావుడు?

కేవలం నారా చంద్రబాబు నాయుడు మాత్రమే అన్నీ తానై ముందుకు సాగించారు. 70 సంవత్సరాల వయసులో కూడా.. ఎక్కడ తగ్గలేదు చంద్రబాబు నాయుడు. దీంతో పవన్ కళ్యాణ్ పై ఏపీ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. 70 ఏళ్ల వయసులో చంద్రబాబు పనులు చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ పడుకున్నాడని మండిపడుతున్నారు. Pawan Kalyan

దీంతో పవన్ కళ్యాణ్ మిస్సింగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఓ కీలక ప్రకటన చేశారు. తాను వస్తే ఫ్యాన్స్ ఎగబడతారని… అందుకే వరదల ప్రాంతాల్లోకి రాలేదని ఈ పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. అలా వరదల ప్రాంతానికి నేను వస్తే సహాయక చర్యలు ఆగిపోతాయని.. ఆయన చెప్పుకొచ్చారు. Pawan Kalyan