Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న మూవీ కల్కి. దీపిక పదుకొనే అండ్ దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్న ఇందులో అమితాబచ్చన్ మరియు కమల్ హాసన్ అదే విధంగా రాజేంద్రప్రసాద్ కీలక పాత్రను పోషిస్తున్నారు.

Prabhas comments

ఇప్పటివరకు ఇందులో నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ సినిమా పై భారీ అంచనాలు పెంచగా ఈ మూవీ జూన్ 27న గ్రాండ్గా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇక రిలీజ్ సమయం కొన్ని గంటలు మాత్రమే ఉండడంతో ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి.

Also Read: Vijay: విజయ్ ని ప్రేమలో దింపిందని స్టార్ హీరోయిన్ ని పక్కన పెట్టిన డైరెక్టర్..?

అంతేకాకుండా బుకింగ్ ఓపెన్ అయినా కొన్ని నిమిషాలకే చాలా థియేటర్స్ హౌస్ ఫుల్ అయ్యాయి. ఇక రిలీజ్ సమయం దగ్గర పడడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ముంబైలో గ్రాండ్గా నిర్వహించారు. అంతేకాకుండా ప్రమోషన్స్ లో భాగంగా అమితాబచ్చన్ అండ్ కమలహాసన్, దీపికా పదుకొనే, ప్రభాస్, ప్రియాంక దత్, స్వప్న దత్ లు కలిసి ఓ స్పెషల్ చిట్ చాట్ వీడియో రిలీజ్ చేశారు.

Prabhas comments

ఇక ఈ సందర్భంగా డార్లింగ్ మాట్లాడుతూ..” బాహుబలి తర్వాత మళ్లీ కామెడీ ఈ సినిమాలోనే ఉంది. అలాగే ఈ చిత్రంలో నేను చేసిన భైరవ పాత్రలో కొంచెం నెగిటివ్ స్టేట్స్ ఉన్నాయి. మొదటిసారి నేను ఇలాంటి పాత్ర చేస్తున్నాను. ఇది నా కెరీర్ లోనే ది బెస్ట్ ” అంటూ తెలియజేశాడు. ప్రజెంట్ ప్రభాస్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Prabhas)