Saripodhaa Sanivaaram: రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. మొన్న శనివారం నుంచి మొదలైన వర్షాలు ఇప్పటికి కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అలాగే ఏపీ వ్యాప్తంగా ఈ వర్షాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా మొత్తం మునిగిపోయింది. చాలామంది వరదల్లో కొట్టుకుపోయారు. Saripodhaa Sanivaaram
Saripodhaa Sanivaaram movie watched by cm revanth reddy
ఖమ్మం పట్టణంలోకి వరదలు రావడంతో… జనాలు నిరాశ్రయులయ్యారు. అయితే.. ఖమ్మం జిల్లా మొత్తం మునిగిపోయిన కూడా ఆ జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు… ప్రజలను అలెర్ట్ చేయడంలో విఫలమయ్యారని వార్తలు వస్తున్నాయి. ఖమ్మం ప్రజలు చెబుతున్న విషయాలను బట్టి చూస్తే… ఖమ్మంలో ఉన్న ముగ్గురు మంత్రులు… అట్టర్ ఫ్లాప్ అయినట్లే మనకు అర్థమవుతుంది. Saripodhaa Sanivaaram
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మిస్సింగ్… ఏపీ ప్రజల తిరుగుబాటు?
అయితే మంత్రులు ఫెయిల్ అయినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం… ఎలాంటి రివ్యూ వరదల పైన నిర్వహించకుండా… ఆదివారం రోజున సరిపోదా శనివారం సినిమా చూశారట. అయితే ఈ కామెంట్లను గులాబీ పార్టీ నేతలు మీడియా ముందే చెబుతున్నారు. సినిమా మూడులో ఉన్న రేవంత్ రెడ్డి ఖమ్మం ప్రజలను గాలికి వదిలేసారని… గులాబీ పార్టీ ఆరోపణలు చేస్తోంది. Saripodhaa Sanivaaram
అదే పక్క రాష్ట్రం విజయవాడ నగరంలో వరదలు వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా యాక్టివ్ గా పని చేశారని కూడా కొనియాడుతోంది గులాబీ పార్టీ. అంతేకాదు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వరద ముంపునకు గురైన బాధితులను పరామర్శించి వారికి ఆహార పదార్థాలను కూడా గులాబీ పార్టీ… అందించింది. Saripodhaa Sanivaaram