Hardik Pandya: హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిక్ గతేడాది వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరు వివాహానికి ముందే ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు. హార్దిక్ పాండ్యా ఓ ప్రముఖ క్రికెటర్. నటాషా సినీ నటి. వీరు వివాహం చేసుకొని ఏడాది గడవకముందే విడాకులు తీసుకున్నారు. వీరి విడాకుల విషయాన్ని వారి సోషల్ మీడియా అకౌంట్ వేదికగా షేర్ చేసుకున్నారు. Hardik Pandya

Hardik Pandya’s home Agastya

ఇది వారికి ఎంతో కఠినమైన నిర్ణయం అని, తప్పని పరిస్థితుల్లో విడాకులు తీసుకోవాల్సి వస్తుంది. విడాకులు తీసుకున్నప్పటికీ మా కుమారుడికి ఎప్పుడు తల్లిదండ్రులుగా ఉంటామని వారి సోషల్ మీడియా అకౌంట్లలో రాసుకొచ్చారు. విడాకుల తర్వాత నటాషా తన కుమారుడిని తీసుకొని సెర్బియాకు వెళ్లిపోయింది. విడాకుల అనంతరం హార్దిక్ పాండ్యా వేరే వారితో రిలేషన్ కొనసాగిస్తున్నట్లు అనేక రకాల రూమర్స్ వస్తూనే ఉన్నాయి. Hardik Pandya

Also Read: Jay Shah: ప్రమాదంలో టీమిండియా …పాకిస్థాన్ చేతిలోకి బోర్డు.. జైషానే కారణమా?

ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఏదో ఒక రూమర్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉన్నాడు హర్దిక్. ఇదిలా ఉండగా…. హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకొని సుమారు నెలన్నర రోజులు అవుతుంది. ఇన్ని రోజులు హార్దిక్ పాండ్యా తన కుమారుడికి దూరంగానే ఉన్నాడు. ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత తన కుమారుడు అగస్త్య తిరిగి తన వద్దకు వెళ్ళినట్లు సమాచారం. దీంతో హార్దిక్ పాండ్యా తన కుమారుడితో కలిసి సంతోషంగా గడుపుతున్నాడు. Hardik Pandya

ఇటీవల నటాషా ముంబైకి తిరిగి వచ్చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఈ ఫోటోలలో అగస్త్య ఎక్కడా కూడా కనిపించలేదు. దీంతో హార్దిక్ పాండ్యా కుమారుడు తన తండ్రి తన దగ్గరికి వెళ్ళాడని తెలుస్తోంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు చాలా రోజుల తర్వాత హార్దిక్ పాండ్యా కుమారుడు తన వద్దకు వెళ్లాడనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. Hardik Pandya