Chandrababu: మోడీ సర్కార్‌ పై సీఎం చంద్రబాబు తిరుగుబాటు చేసినట్లు కనిపిస్తోంది. కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రూ.3300 కోట్లు విడుదల అయ్యాయని నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే.. దీనిపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని…అవన్ని పుకార్లు మాత్రమేనని తెలిపారు. మాకైతే ఇంతవరకు ఎలాంటి సమాచారం రాలేదన్నారు సీఎం చంద్రబాబు. మేం ఇంకా ప్రాథమిక నివేదిక పంపలేదన్నారు. Chandrababu

CM Chandrababu rebellion against Modi government

ఏరియల్ సర్వే చేశానని… కొల్లేరుసరసు,బుడమేరు,కృష్ణానది పరివాహక ప్రాంతం చూశానని వివరించారు సీఎం చంద్రబాబు. బుడమేరు గండ్లు పూడ్చాలన్నారు. ఈ రోజు రాత్రి కల్లా బుడమేరు గండ్లు పూడుస్థామని తెలిపారు. ఆర్మీ వాళ్ళు కూడా సర్వశక్తులు ఒడ్డి పని చేస్తున్నారని కొనియాడారు సీఎం చంద్రబాబు. వార్ పూటింగ్ లో పని చేస్తున్నామన్నారు. Chandrababu

Also Read: KCR: గులాబీ పార్టీ సోషల్ మీడియాకు సంకెళ్లు?

149 అర్బన్,30 గ్రామ సచివాలయంలోని పనులు జరుగుతున్నాయని.. శానిటేషన్,వాటర్ వస్తున్నాయి అని ఫీడ్ బ్యాక్ తీసుకున్నామని వెల్లడించారు సీఎం చంద్రబాబు.
భోజనాలు కూడా బాగున్నాయని ప్రజల నుండి స్పందన వచ్చిందని తెలిపారు. 3 లక్షలకు పైగా ప్యాకెట్ల భోజనం సరఫరా చేశామని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. 7 వేల మంది శానిటేషన్ సిబ్బంది పని చేస్తున్నారన్నారు. Chandrababu

110 ఫైర్ ఇంజన్లు పని చేస్తున్నాయని… 10 వేల ఇళ్లు ఇప్పటి వరకూ క్లిన్ చేశామని తెలిపారు సీఎం చంద్రబాబు. 23 వేల కు పైన ఇళ్ళకూ ఇంక విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని… 680 కి పైగా JCB, ఇతర వాహనాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఉచిత బస్సులు తిరుగుతున్నాయన్నారు. సెల్ ఫోన్ టవర్స్ కూడా దాదాపు అన్ని పని చేస్తున్నాయి… ప్లంబర్స్, మెకానిక్ లు, ఎలక్త్రిషన్స్ నీ కూడా సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు. Chandrababu