Raj Tarun and I both took drugs together.. Lavanya gave a twist

Raj Tarun: రాజ్ తరుణ్ లావణ్య ఇష్యు కి గత కొద్ది రోజులుగా తెరపడినట్లే అనిపించింది. కానీ తాజాగా లావణ్య చెప్పిన అన్ని విషయాలు నిజమేనని పోలీసులు సంచలన విషయాన్ని బయటపెట్టి రాజ్ తరుణ్ ని నిండితుడిగా పేర్కొన్నారు. దీంతో సత్యమే గెలిచింది అంటూ లావణ్య మరోసారి మీడియా ముందుకు వచ్చింది. ఇక లావణ్య ప్రముఖ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ ఎన్నో విషయాలు బయటపెట్టింది.. ఇన్ని రోజులుగా మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అని మీడియా వాళ్ళు అడగగా సత్యమే ఎప్పటికైనా గెలుస్తుందని నేను ఇన్ని రోజులు మౌనం వహించాను సత్యమే గెలిచింది అని చెప్పింది.

Raj Tarun and I both took drugs together.. Lavanya gave a twist

మీరు నిజంగానే డ్రగ్స్ తీసుకున్నారా అని మీడియా వాళ్ళు అడగగా..నేను డ్రగ్స్ తీసుకుంటే రాజ్ కూడా తీసుకున్నట్టే..ఇద్దరం కలిసి తీసుకున్నట్టే. కానీ మాకు ఆ అలవాటు లేదు. నేను ఒక సామాన్య అమ్మాయిని కావాలనే నన్ను ఈ డ్రగ్స్ కేసులో ఇరికించి చేతులు దులుపుకుందాం అనుకున్నారు. కానీ ఈ విషయంపై నేను న్యాయపోరాటం చేస్తాను. మేము ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు అంటూ సమాధానం ఇచ్చింది. మిమ్మల్ని రాజ్ తరుణ్ ఫ్యామిలీ తెలియదు అని అంటున్నారు అది నిజమేనా అని అడగగా.. (Raj Tarun)

Also Read: Movie: గెట్ రెడీ ఫ్యాన్స్ అంటున్న డైరెక్టర్స్.. చిరు బాలయ్య కాంబోకి ముహూర్తం ఫిక్స్.?

నేను రాజ్ తరుణ్ ఫ్యామిలీకి తెలియకపోతే తొందరగా పిల్లల్ని కనండి అంటూ ఎందుకు వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదిస్తారు అని ఒక వీడియోని మీడియా వాళ్లకు చూపెట్టింది లావణ్య.అంతేకాదు మాకు తెలిసి తెలియని వయసులో పెళ్లి జరిగింది. పెళ్లి అయిన కొద్ది రోజులకు రెండు కుటుంబాలకి ఈ విషయాన్ని చెప్పాము. ఇక వాళ్ళు కూడా అంగీకరించారు. ఇక డబ్బు ఎక్కువగా లేని సమయంలో నాకు ప్రెగ్నెన్సీ కూడా అయింది. కానీ ఆ టైంలో మాకు ఎలాంటి సౌకర్యాలు లేవు డబ్బు కూడా చేతిలో లేదు అని రాజ్ తరుణ్ నేను నిర్ణయం తీసుకొని అబార్షన్ చేయించుకోవాలని డిసైడ్ అయ్యాం. ఆ తర్వాత మరోసారి మిస్ క్యారేజ్ అయింది.

Raj Tarun and I both took drugs together.. Lavanya gave a twist

రాజ్ తరుణ్ తన డబ్బులు పెట్టే తాళి,పెళ్లికి కావలసిన వస్తువులు కొన్నారు. ఆ సమయంలో రాజ్ తరుణ్ దగ్గర కొద్ది డబ్బు మాత్రమే ఉంది.మేము ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా గుడిలో వివాహం చేసుకున్నాం. అందుకే ఫోటో తీయడానికి కూడా మూడో వ్యక్తి లేరు. ఈ విషయాలన్నీ నేను కోర్ట్ తో చెప్పి తేల్చుకుంటాను. నేను రీసెంట్గా విదేశాలకు వెళ్ళిన సమయంలో కూడా రాజ్ తరుణ్ ఫ్యామిలీ వచ్చి నన్ను ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కించి వెళ్లారు. మేమిద్దరం దాదాపు 11 సంవత్సరాలుగా సహజీవనం చేసాం. ఈ విషయాన్ని పోలీసులే తేల్చేశారు..అంటూ సంచలన విషయాన్ని బయట పెట్టింది లావణ్య.(Raj Tarun)