The star Heroine who ruined the producer life

Heroine: కొంతమంది హీరోయిన్లు క్రేజ్ ని బట్టి సినిమాల్లో నటించడానికి ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం నిర్మాత ఇల్లు, స్థలాలు అమ్ముకోవాల్సిందే. అలా తయారైంది ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న కొంత మంది నిర్మాతల పరిస్థితి. అయితే ఓ హీరోయిన్ మాత్రం చూడడానికి బయటకి ఒకలా లోపల మరోలా ఉంటుంది.ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు త్రిష.ఈ ముద్దుగుమ్మ బయటకి ఎంతో అందంగా కనిపిస్తుంది.కానీ లోలోపల ఈమె నిజ స్వరూపం వేరే ఉంది అంటారు ఈ విషయం తెలిసిన చాలా మంది జనాలు.

The star Heroine who ruined the producer life

మరి ఇంతకీ త్రిష నిజ స్వరూపం ఏంటి.. త్రిష కారణంగా ఏ నిర్మాత బలయ్యాడు అనేది ఇప్పుడు చూద్దాం.. త్రిష గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు మనం మీడియాలో చాలాసార్లు చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం. అయితే మొదటిసారి ఓ నిర్మాత నేరుగా తన సినిమా గురించి త్రిష పై షాకింగ్ కామెంట్లు చేశారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. త్రిషతో చేసిన నాయకి సినిమా వల్ల నా బతుకు నాశనం అయ్యింది. నేను సంపాదించిన డబ్బు అంతా నాయకి సినిమాపై పెట్టుబడిగా పెట్టాను. (Heroine)

Also Read: Deepika Padukone: గుడ్ న్యూస్.. తల్లయిన దీపిక పదుకొనే..కానీ ఆ పొరపాటుతో.?

కానీ చివరికి నాకు మిగిలింది ఏమీ లేదు. ఈ సినిమా సమయంలో డైరెక్టర్ దాదాపు పది కోట్లకు మించి బడ్జెట్ చేశాడు. కానీ సినిమా చూస్తే అందులో ఏం లేదు అనిపించింది. దాంతో త్రిషని రెమ్యూనరేషన్ తీసుకోకుండా తమిళ్ సాటిలైట్ హక్కులు ఇస్తానని చెప్పాను. కానీ ఆమె మాత్రం పట్టు పట్టి కోటి రూపాయలు రెమ్యూనరేషన్ కావాలని చెప్పింది.ఆ విషయంలో ఎంత సర్ది చెప్పినా వినలేదు. అంతేకాదు నాయకి సినిమా కంటే ముందే త్రిషకి సంబంధించిన మరో సినిమా విడుదలై ఫ్లాప్ అయింది.

The star Heroine who ruined the producer life

దాంతో ఆ ఎఫెక్ట్ నాయకి మూవీ పై పడి ఇది కూడా డిజాస్టర్ అయింది.ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో నేను అప్పుల పాలయ్యాను. నా జీవితం పూర్తిగా నాశనం అంటూ నాయకి మూవీ నిర్మాత గిరిధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇక ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్స్ త్రిష అలాంటిదా.. కోటి రూపాయల రెమ్యూనరేషన్ కోసం అంతలా టార్చర్ చేసి చేసిందా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.(Heroine)