Bigg Boss 8: బిగ్ బాస్ సీజన్ 8 లో ఎంట్రీ ఇచ్చిన ఆ లేడీ కంటెస్టెంట్ నిజంగానే రాఘవేంద్రరావుకి కూతురు అవుతుందా.. ఇప్పటివరకు ఈ విషయం తెలియదే..ఇంతకీ రాఘవేంద్రరావుకి ఆ లేడీ కంటెస్టెంట్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..వీరి మధ్య ఎలా రిలేషన్ ఉంది..ఎలా కూతురు అవుతుంది అనే సంచలన విషయం ఇప్పుడూ తెలుసుకుందాం.. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు.
That lady contestant in Bigg Boss 8 is Raghavendra Rao daughter
అందులో నుండి నిన్న ఆదివారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయింది..అయితే విజయవాడ వరదల్లో మునిగిపోవడం కారణంగా బేబక్కకి తక్కువ ఓటింగ్ పడినట్లు తెలుస్తోంది.ఇక ఈ హౌస్ లో ఉన్న ఓ లేడీ కంటెస్టెంట్ రాఘవేంద్రరావుకి వరసకి కూతురు అవుతుందట. ఇక ఆ లేడి కంటెస్టెంట్ ఎవరో కాదు తాజాగా ఎలిమినేట్ అయిన బేబక్కనే.. అవును మీరు వినేది నిజమే.(Bigg Boss 8)
Also Read: Heroine: డబ్బులు దొబ్బేసి నిర్మాత జీవితాన్ని సర్వం నాకేసిన స్టార్ హీరోయిన్.?
బెజవాడ బేబక్క రాఘవేంద్రరావుకి కూతురు అవుతుందట.ఇక వీరి మధ్య అసలు రిలేషన్ ఎలా కలిసిందంటే..బేబక్క తల్లి రాఘవేంద్రరావు భార్య ఇద్దరు సొంత అక్కా చెల్లెళ్లు .. అలా బేబక్క పెద్దమ్మ రాఘవేంద్రరావుకి భార్య కావడంతో రాఘవేంద్రరావుకి వరసకు కూతురు అవుతుంది.అలా వీరిద్దరి మధ్య తండ్రి కూతుర్ల అనుబంధం ఉంది.ఇక ఈ విషయాన్ని బేబక్క ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది..
విదేశాల్లో ఉద్యోగం చేసిన బేబక్క కరోనా కారణంగా ఇండియాకి వచ్చేసి ఇక్కడే సినిమాల్లో క్యారెక్టర్ గా చేస్తూ మిమిక్రీ ఆర్టిస్ట్ గా అలాగే సింగర్ గా కూడా కొద్ది రోజులు చేసింది. కానీ ఇవన్నీ చేసినా రాని గుర్తింపు సోషల్ మీడియా ద్వారా వచ్చింది. అలా సోషల్ మీడియా ద్వారా వచ్చిన గుర్తింపుతో బిగ్ బాస్ షో లో అవకాశం వచ్చింది.. కానీ ఒక వారానికే ఎలిమినేట్ అయింది.ఇక బేబక్క అన్న టాలీవుడ్ లో ఆర్టిస్ట్. ఆయన ఎవరో కాదు వంశీ నెక్కంటి.ఈయన పుష్ప, ఖలేజా, రణరంగం వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు.(Bigg Boss 8)