Relation with those two before Vijay Varma.. Tamannaah bold comments

Tamannaah: తమన్నా ఏ విషయం అయినా సరే చాలా ఓపెన్ గా చెప్పే మైండ్ సెట్ ని కలిగి ఉంది. అందుకే తన ప్రేమ విషయాన్ని కూడా దాచిపెట్టలేదు.కానీ గతంలో హీరో కార్తీతో ఉన్న రిలేషన్ ని మాత్రం బయట పెట్టలేదు. అయితే ఈ రిలేషన్ ని కొద్ది రోజులు మెయింటైన్ చేసి విజయ్ వర్మతో ఎలా అయితే ఆ రిలేషన్ బయటపెట్టిందో అలాగే చేద్దాం అనుకుంది. కానీ బెడిసి కొట్టింది.

Relation with those two before Vijay Varma.. Tamannaah bold comments

వీరిద్దరి మధ్య ప్రేమ విఫలం అవ్వడంతో ఈ రిటేషన్ ని బయట పెట్టలేకపోయింది. అయితే తాజాగా రాజ్ షమణి కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా షాకింగ్ కామెంట్లు చేసింది. నా హృదయం రెండుసార్లు ముక్కలైంది. రెండుసార్లు నాకు లవ్ బ్రేకప్ అయ్యింది అని తమన్నా మాట్లాడిన మాటలు చాలామందిని ఎమోషనల్ గా కట్టిపడేసాయి. తమన్నా మాట్లాడుతూ.. నేను ఇప్పటికే రెండుసార్లు నా హృదయం ముక్కలు చేసుకున్నాను. (Tamannaah)

Also Read: Bigg Boss 8: బిగ్ బాస్ లో ఆ లేడీ కంటెస్టెంట్ రాఘవేంద్ర రావు కూతురా.. ఇదెక్కడి రిలేషన్.?

ఓసారి టీనేజ్ లో ఉన్నప్పుడు ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డాను.కానీ ఆ వ్యక్తి నా లక్ష్యానికి అడ్డయ్యాడు. నా మనస్సాక్షిని చంపుకొని ఆయనతో ప్రేమను కంటిన్యూ చేయలేకపోయాను. అందుకే బ్రేకప్ చెప్పేసాను. ఇక మరోసారి కూడా ఓ వ్యక్తితో కొద్ది సంవత్సరాలు రిలేషన్ లో ఉన్నాను. కానీ ఆ రిలేషన్ అబద్దాలతో కొనసాగడం నాకు నచ్చలేదు. ప్రతిసారి అబద్ధమే చెబితే నిజం చెప్పినా కూడా నమ్మే పరిస్థితి ఉండదు.

Relation with those two before Vijay Varma.. Tamannaah bold comments

అందుకే ఆయనకి కూడా బ్రేకప్ చెప్పాను. అలా రెండుసార్లు నా హార్ట్ బ్రేక్ అయింది అంటూ తమన్నా షాకింగ్ కామెంట్లు చేసింది. ప్రస్తుతం తమన్నా మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ ఒకరు కార్తీ అయితే ఇంకొకరు కాలేజీ రోజుల్లో తన క్లాస్ మేట్ కావచ్చు అని కామెంట్లు పెడుతున్నారు.(Tamannaah)