Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ ఎంత దూరం పెడుతున్నా వారి ఫ్యామిలీ ఆదరణ కోసం అన్ని విషయాల్లో తగ్గుతున్నారు. రీసెంట్గా బాలకృష్ణ 50 ఏళ్ల సినీ వేడుకకి కూడా ఆయనకు,ఆయన అన్న కళ్యాణ్‌రామ్ కి ఆహ్వానం అందగలేదు. కానీ ఆ తర్వాత బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కి సంబంధించిన పోస్టర్ ఆయన బర్త్‌డే రోజు విడుదలవగా సినిమాల్లో సక్సెస్ఫుల్ అవ్వాలని,అలాగే తమ్ముడికి బర్త్‌డే విషెస్ కూడా తెలియజేశారు ఎన్టీఆర్,కళ్యాణ్‌రామ్. ఇలా ఎంత చేసినా కూడా నందమూరి ఫ్యామిలీ దూరమే పెడుతుంది.
If I die everyone should do that.. Jr.NTR emotional comments
అయితే ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లు ఎమోషనల్ గా ఫీల్ అవుతున్న వేళ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేను చనిపోతే అందరూ ఆ పని చేయాలంటూ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. మరి ఇంతకీ ఎన్టీఆర్ ఏం మాట్లాడారు.. చావు గురించి ఆయన నోటి నుండి ఎందుకు ఆ మాటలు వచ్చాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్ ఒకప్పుడు వరుస ఫ్లాప్ లతో సతమతమయ్యారు. ఆ సమయంలో,పూరి జగన్నాధ్ దర్శకత్వంలో టెంపర్ మూవీ చేశారు.(Jr.NTR)
ఈ సినిమా ఎన్టీఆర్ ని మళ్లీ కంబ్యాక్ అయ్యేలా చేసింది. అయితే ఈ మూవీ షూటింగ్ ముందు కథ రెడీ చేసిన వక్కంతం వంశీ ఇప్పటికే రెండు ప్లాపులు వచ్చాయి. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే మీ పరిస్థితి ఏంటి.. హ్యాట్రిక్ ఫ్లాప్ హీరోగా పేరు తెచ్చుకుంటారు కదా.. మీ నిర్ణయం ఏంటి అని అడిగారట.దానికి ఎన్టీఆర్ నాకు టెంపర్ మూవీ కథ చాలా బాగా నచ్చింది.. మంచివాడు చెడ్డవాడిగా మారితే ఎవరు గుర్తించరు. కానీ ఒక చెడ్డవాడు మంచివాడిగా మారితే అందరూ గుర్తిస్తారు. వాడు చనిపోయిన కూడా దేవుడని అంటారు..
నేను నమ్మే సిద్ధాంతం ప్రకారమే నాకు ఈ సినిమా ఉంది అనిపించింది. అందుకే ఈ స్టోరీ వినగానే నేను ఓకే చెప్పాను.. నిజ జీవితంలో కూడా ఒకవేళ నేను చనిపోతే కేవలం నా కుటుంబం, బంధువులు మాత్రమే కాదు. బయట కూడా ఎంతో కొంత మంది నా గురించి బాధపడి అరే మంచివాడు చనిపోయాడు అని అనుకునే వారిని సంపాదించుకోగలగాలి.. నేను చనిపోతే కొంతమంది అయినా బాధపడాలి.అదే నేను నమ్మే సిద్ధాంతం అంటూ ఎన్టీఆర్ వక్కంతం వంశీకి ఎమోషనల్ గా ఈ విషయాన్ని చెప్పారట. ప్రస్తుతం అప్పటి మేటర్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది.(Jr.NTR)