Differences in the Daggubati family

Daggubati family: ఏంటి దగ్గుబాటి ఫ్యామిలీలో విభేదాలా.. ఎంతో అన్యోన్యంగా కలిసి ఉండే అన్నదమ్ములు ఎందుకు విడిపోయారు.. ఎందుకు కొట్టుకున్నారు అనే సంగతి ఇప్పుడు చూద్దాం. దగ్గుబాటి ఫ్యామిలీలో విభేదాలు వచ్చి ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకున్నారంటే అందరూ ఆస్తి కోసమో లేదా మరో విషయం ఏదైనా అనుకుంటారు. కానీ దగ్గుబాటి ఫ్యామిలీ లోని సురేష్ బాబు వెంకటేష్ ఇద్దరు కొట్టుకున్నది మీరు అనుకుంటున్నట్లు డబ్బుల కోసం అయితే కాదు.

Differences in the Daggubati family

ఇక అసలు విషయం ఏమిటంటే.. మూవీ మొగల్ స్టార్ ప్రొడ్యూసర్ అయినటువంటి రామానాయుడు తనయులుగా ఇండస్ట్రీలోకి ఒకరు హీరోగా మరొక నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు.అయితే తండ్రి బతికున్న సమయంలో అందరూ ఒకే దగ్గర ఉండేవారు కాబట్టి ఇంట్లో అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరిగేవట.అయితే గొడవలు అంటే అవి వ్యక్తిగతంగా కాదు ఫన్నీ గానే.. (Daggubati family)

Also Read: Bigg Boss 8: బిగ్ బాస్ లో ఆ లేడీ కంటెస్టెంట్ రాఘవేంద్ర రావు కూతురా.. ఇదెక్కడి రిలేషన్.?

ఇక అలాంటి ఒక విషయాన్ని వెంకటేష్ చిరంజీవి వ్యాఖ్యాతగా చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు అనే షోకి గెస్ట్ గా వచ్చిన సమయంలో బయట పెట్టారు.. మా ఇంట్లో కోడి కూర అందరూ తింటారు. కాబట్టి రెండు కోళ్లు కోసేవాళ్ళు కానీ రెండు కోళ్లు కోసినా కూడా మా జనాభా కి సరిపోయేది కాదు. దాంతో డైనింగ్ టేబుల్ దగ్గర మా అన్నయ్య నేను ముక్కల కోసం నాన్న చూడకుండా డైనింగ్ టేబుల్ కింద కాళ్లతో ఒకరిని ఒకరం తన్నుకునే వాళ్ళం.

Differences in the Daggubati family

అలా కోడి కూర వండిన రోజు మా ఇద్దరికీ డైనింగ్ టేబుల్ కింద వార్ జరిగేది.ఇక మేమే చికెన్ ప్రియులం అనుకుంటే మా తర్వాత రానా కూడా వచ్చి చేరాడు.ఇక రానా రావడంతో డైనింగ్ టేబుల్ దగ్గర మా ముగ్గురి మధ్య వార్ ఎక్కువైపోయింది అంటూ ఫన్నీ విషయాన్నీ వెంకటేష్ చెప్పుకొచ్చారు.(Daggubati family)