Ys Jagan: విజయవాడ వరదల్లో 60 మంది చనిపోయారు. అయితే ఈ అంశాన్ని పక్కద్రోవ పట్టించడానికి టీడీపీ ప్రభుత్వం మాజీ దళిత ఎంపీ ని అరెస్టు చేశారంటూ జగన్ ఆరోపణలు చేశాడు. టీడీపీ కార్యాలయంపై దాడి ఎందుకు జరిగిందంటూ జగన్ ప్రశ్నించడం జరిగింది. గుంటూరు జిల్లా జైల్లో మాజీ ఎంపీ నందిగం సురేష్ ను వైసీపీ అధ్యక్షుడు జగన్ పరామర్శించారు. Ys Jagan
Ys Jagan comments on red book over tdp
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని బోసిడికే అని తిట్టారంటూ టీడీపీ కార్యాలయంలో టీడీపీ అధికార ప్రతినిధి సీఎం లం….. కొడకా అన్నారని, ఆ మాదిరిగా తిట్టినందుకు ముఖ్యమంత్రిని ప్రేమించే వారికి వైసీపీ అభిమానులకు కడుపు మండదా అంటూ జగన్ ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా చెబితేనే అలా చేస్తారా, ఈ అన్యాయాన్ని చూడకూడదు అనుకునే వారు టీడీపీ కార్యాలయం వద్దకు వెళ్లి ధర్నా చేస్తే అలా ధర్నాకు వెళ్లిన వారిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. రెడ్ బుక్ పెట్టుకోవడం పెద్ద పని కాదని.. మేం కూడా టీడీపీ నేతలను త్వరలోనే జైల్లో వేస్తామని హెచ్చరించారు.Ys Jagan
Also Read: Mohan Babu University: మోహన్ బాబు దందాలు..విద్యార్థులపై బౌన్సర్లతో దాడి ?
ఆ సమయంలో కొద్దో గొప్పో రాళ్ళు పడి ఉంటాయని జగన్ అన్నారు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న తాను చంద్రబాబు మీద కక్ష సాధింపులతో వ్యవహరించలేదని టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో పాల్గొన్న వారందరిని గుర్తించామన్నారు. నిందితుల సెల్ ఫోన్లు, సీసీ కెమెరాలు చూసి వారందరినీ 41ఏ నోటీసులు ఇచ్చి కోర్టులో ప్రవేశపెట్టినట్టుగా జగన్ చెప్పారు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులు కావడంతో 41ఏ ఇచ్చి కోర్టులో హాజరు పరిచామని, తమ నిబద్ధతతో అడుగులు వేసామని, ఈ కేసులో నిందితులపై అప్పట్లో చర్యలు తీసుకున్నామని జగన్ చెప్పారు. Ys Jagan