Hardik Pandya: టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, సెర్బియా నటి నటాషా స్టాంకోవిక్ కొద్దిరోజుల క్రితమే వారి వైవాహిక జీవితానికి వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. వీరు గత సంవత్సరం హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. మూడేళ్ల క్రితం ఓ మగ బిడ్డకు జన్మనిచ్చిన ఈ జంట గత సంవత్సరం వివాహం చేసుకున్నారు. వీరికి ప్రస్తుతం నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. Hardik Pandya

natasha sensational post on Hardik Pandya

ప్రస్తుతం వీరు విడాకులు తీసుకొని వేరుగా ఉంటున్నారు. ఈ విషయాన్ని వారి సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేసుకున్నారు. విడాకులు తీసుకున్నప్పటికీ తమ కుమారుడు అగస్త్యకు కో పేరెంట్స్ గా ఉంటామని తెలిపారు. విడాకుల అనంతరం నటాషా తన కుమారుడిని తీసుకొని సెర్బియాకు వెళ్లిపోయింది. ఈ మధ్యనే మళ్లీ ముంబైకి తిరిగి వచ్చిందని సమాచారం. ఇదిలా ఉండగా… తాజాగా నటాషా సోషల్ మీడియాలో ఓ రీల్ కు లైక్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆ రీల్ ఉద్దేశం ఏంటంటే ….రిలేషన్ షిప్ ను మోసం చేసే విధంగా ఆ రీల్ ఉండడం. Hardik Pandya

Also Read: Shubman Gill: వివాదంలో గిల్… పీకల దాకా తాగి హీరోయిన్ తో చిందులు…?

దీంతో నటాషా ఆ రీల్ కు లైక్ చేయడం మరో కొత్త చర్చకు తెర లేపుతోంది. హార్దిక్ పాండ్యానే నటాషాను మోసం చేశాడని అనేక రకాలుగా వాధలను వినిపిస్తున్నాయి. పలువురు హీరోయిన్లు, సెలబ్రిటీల మోజులో పడిన పాండ్యా తన భార్య నటాషా, కుమారుడు అగస్త్యకు తగిన సమయం కేటాయించకపోవడం వల్లనే ఇద్దరు మధ్య మనస్పర్ధలు వచ్చాయని ….అనేక రకాల గొడవలు జరిగాయని సమాచారం అందుతోంది. Hardik Pandya

వారికి తగిన సమయం ఇవ్వకపోవడం, అంతేకాకుండా విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన పాండ్యా ఇతరులతో ఎఫైర్లు పెట్టుకున్నట్లు తెలియడంతో నటాషా హార్దిక్ ను నిలదీసిందట. దీంతో ఇద్దరి మధ్య గొడవలు, మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని వేరుగా ఉంటున్నారు. విడాకుల అనంతరం హార్దిక్ పాండ్యా బాలీవుడ్ హీరోయిన్లతో ఎఫైర్లు కొనసాగిస్తున్నట్లు అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఏదో ఒక రూమర్ కారణంగా హార్దిక్ పాండ్యా వైరల్ అవుతూనే ఉన్నారు. Hardik Pandya