Virat Kohli: భారతదేశంలో క్రికెట్ ని చాలామంది ఇష్టపడతారు. ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్న సంగతి తెలిసిందే. ఇండియా మ్యాచ్ ఆడుతుందంటే చాలు ప్రతి ఒక్కరూ టీవీల ముందు కూర్చుంటారు. ముఖ్యంగా ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు చూడకుండా అసలు ఉండలేరు. అయితే విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బూమ్రా, షాహిన్ ఆఫ్రిది, మహమ్మద్ రిజ్వాన్ వంటి ఆటగాళ్లు ఒకే టీమ్ లో కనిపిస్తే ప్రేక్షకులకు ఉండే కిక్కే వేరు. Virat Kohli
Virat Kohli-Babar Azam in the same team
ఇక త్వరలోనే ఉపఖండంలోని చాలామంది అభిమానుల కల నిజమయ్యే అవకాశం రాబోతుంది. ఓకే జట్టు తరుపున భారత్ – పాకిస్తాన్ స్టార్ ప్లేయర్లు క్రికెట్ ఆడే ఛాన్స్ ఉంది. ఆఫ్రో-ఆసియా కప్ ఇలా ఇరుదేశాల ఆటగాళ్లు ఒకే జట్టులో కలిసి ఆడే అవకాశం రానుంది. ఆఫ్రికన్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ సమోద్ దామోదర్ తదుపరి ఐసీసీ బాస్ జైశా అధ్యక్షతన 2025లో ఆఫ్రో-ఆసియన్ కప్ ను మళ్లీ తిరిగి ప్రారంభించవచ్చని వెల్లడించారు. Virat Kohli
Also Read: Hardik Pandya: ఒక్కరితో కాదు.. 10 మందితో పాండ్యాకు రిలేషన్?
35 ఏళ్ల జైసా ఇటీవలే ఐసీసీ చైర్మన్ గా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది డిసెంబర్ 01 నుంచి ఆయన చైర్మన్ గా తన బాధ్యతలను చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఈ టోర్నీని నిర్వహించే అవకాశం ఉందని దామోదర్ తెలియజేశారు. ఈ విషయంపై ఇంతకు ముందే వారి మధ్య అనేక రకాల చర్చలు జరిగినట్లు సమాచారం అందుతుంది. Virat Kohli