Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ – బంగ్లాదేశ్ మ్యాచ్ క్రికెట్ ప్రేమికులను ఆటతోనే కాదు పర్ఫామెన్స్ లతోను ఆకట్టుకుంది. ఒక గెలుపు కోసం వారు పడిన కష్టాలు అన్ని ఇన్ని కావు. వికెట్లు తీయడం, బంగ్లా బ్యాటర్లు కొట్టే పరుగులు ఆపడమే కాదు అంతకు మించిన నటనతోను కళ్ళు చెమ్మగిళ్లే పర్ఫామెన్స్ ఇచ్చారు. బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 12వ ఓవర్ వద్ద ఓ ఘటన జరిగింది. అప్పుడప్పుడే వర్షం కొద్దికొద్దిగా ప్రారంభమవుతుంది. డక్వర్త్ లూయిస్ ప్రకారం ఆఫ్గనిస్తాన్ 2 పరుగుల ముందంజలో ఉంది. Afghanistan
Afghanistan came to the semis after cheating
అలాంటి టైంలో ఒక బాల్ వేస్తే బంగ్లాదేశ్ బ్యాటర్ ఫోర్ కానీ డబుల్ కానీ కొడితే వర్షం పడి మ్యాచ్ అయిపోతే విన్నింగ్ బంగ్లాదేశ్ నే వరిస్తుంది. అందుకే ఆఫ్గాన్ కోచ్ ట్రాట్ ఓ వ్యూహంతో వచ్చాడు. డక్ అవుట్ నుంచే వర్షం పడేలా ఉంది. మ్యాచ్ జరగకుండా స్లోడౌన్ చేయండి అన్నారు ఆఫ్గనిస్తాన్ ఆటగాళ్లతో. అంతేకాకుండా సైగలు కూడా చేశాడు. ఆయన ఆ ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ తో టైం పాస్ చేయండి అని చెప్పి ఉండొచ్చు. కానీ ఆఫ్గనిస్తాన్ ఆటగాళ్లు గుల్బుద్దీన్ నయీబ్ తనలోని యాక్టింగ్ స్కిల్స్ ని బయటకు తీశాడు. కోచ్ చెప్పాడు కదా అని పని చెప్పాడు. Afghanistan
Also Read: Hardik Pandya: ఐపీఎల్ లో పాండ్యా అట్టర్ ఫ్లాఫ్..కానీ దేశం కోసం ఆడుతున్నాడు ?
స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న గుల్బుద్దీన్ నయీబ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా పడిపోయాడు. తొడ కండరాలు పట్టేసినట్టు విలవిలలాడిపోయాడు. వెంటనే మెడికల్ స్టాఫ్ వచ్చి గుల్బుద్దిన్ నయీబ్ ను పెవిలియన్ తీసుకెళ్లారు. ఫలితంగా మ్యాచ్ ఓ రెండు నిమిషాల పాటు ఆగిపోయింది. ఈలోగా వర్షం పెద్దదైందని అంపైర్లు మ్యాచ్ ఆపేశారు. ఇదే ఆఫ్గానిస్థాన్ కు కావలసింది. ఒకవేళ వర్షం కంటిన్యూ అయ్యి ఉంటే ఆఫ్ఘనిస్తాన్ నే విజయం వరించేది కానీ… ఆ తర్వాత వర్షం పడలేదు. Afghanistan
ఇక మ్యాచ్ వివరాలలోకి వెళితే… ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 115 పరుగులు మాత్రమే చేసింది. ఇందులో… టాప్ ఆర్డర్ అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు విఫలం కావడంతో… తక్కువ స్కోర్ మాత్రమే ఆఫ్ఘనిస్తాన్ చేయగలిగింది. అయితే అనంతరం బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో ఆల్ అవుట్ అయింది. కేవలం 105 పరుగులు చేసిన బంగ్లాదేశ్ జట్టు… ఆఫ్ఘనిస్తాన్ చేతిలో 8 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఆఫ్గనిస్తాన్ జట్టు నేరుగా సెమిస్కు వెళ్ళింది. Afghanistan