The case against Jani Master

Jani Master: స్టార్ కొరియోగ్రాఫర్ లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ పై తాజాగా లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది.దాంతో ప్రస్తుతం జానీ మాస్టర్ పేరు మీడియాలో వైరల్ గా మారుతుంది. అయితే కేరళలో హేమ కమిటీ రిపోర్ట్ ద్వారా ఇప్పటికే ఎంతోమందిపై కేసు నమోదు అయింది. దీంతో అన్ని ఇండస్ట్రీలలో అలాంటి ఓ కమిటీ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు ఆర్టిస్టులు.

The case against Jani Master

ఇందులో భాగంగా తాజాగా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్ పై 21 ఏళ్ల కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది.అయితే ఆమె నార్సింగి కి చెందిన మహిళ కావడంతో ఈ కేస్ ని రాయదుర్గం పోలీసులు నార్సింగి పోలీస్ స్టేషన్ కి పంపించారు. ఇక ఒక్కసారి గా ఆ మహిళ పెట్టిన కేసుతో జానీ మాస్టర్ గురించి మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి.(Jani Master)

Also Read: Meena: మీనాకి పొగరు నెత్తికెక్కిందా.. స్టార్ హీరో అని కూడా చూడకుండా.?

అయితే ఇప్పటికే జానీ మాస్టర్ పై కొన్ని కేసులు ఉన్నాయి. గతంలో కాలేజీలో మహిళపై అత్యాచారం కేసులో ఆయన జైలుకు వెళ్లారు.ప్రస్తుతం ఈ లేడీ కొరియోగ్రాఫర్ పెట్టిన కేస్ తో మరోసారి జానీ మాస్టర్ పై చాలా మంది నెటిజెన్స్ మండిపడుతున్నారు. ఆ లేడీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనని చాలా రోజులుగా లైంగికంగా వేధిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొంది.

The case against Jani Master

ఆయన తన ఇంటికి వచ్చి మరీ తనని కొట్టి లైంగికంగా వేధించాడని, అలాగే చెన్నై,ముంబై వంటి అవుట్డోర్ షూటింగ్లకి వెళ్లిన సమయంలో కూడా చాలాసార్లు లైంగికంగా వేధించి కొట్టి గాయపరచాడని ఆ మహిళ చెప్పింది. ఇక ఈ విషయంలో జానీ మాస్టర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో ప్రస్తుతం జానీ మాస్టర్ పేరు మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది.(Jani Master)