Secretly married Siddharth Aditi

Siddharth: సినీ నటుడు సిద్ధార్థ్ తెలుగులో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించి ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీ పైనే విమర్శలు చేసిన హీరో. దాంతో తెలుగు ఇండస్ట్రీ చేరదీయలేదు. ఇక తప్పు తెలుసుకున్న సిద్ధార్థ్ మళ్లీ తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటున్నారు.అయితే అలాంటి సిద్ధార్థ్ గత కొద్ది రోజులుగా హీరోయిన్ అదితి రావు హైదరితో ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే.

Secretly married Siddharth Aditi

వీళ్ళిద్దరూ డేటింగ్ చేసిన సమయంలో ఎన్నో ప్రేమ వార్తలు చక్కర్లు కొట్టినప్పటికీ దానిపై క్లారిటీ ఇవ్వలేదు. అంతే కాదు మా ఇద్దరి మధ్య అలాంటి రిలేషన్ ఏమి లేదు అని కొట్టి పారేశారు. కానీ సడన్గా వీళ్ళిద్దరూ వనపర్తి లోని శ్రీరంగాపురం రంగనాయక స్వామి ఆలయంలో ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. అయితే వీరు ఎంగేజ్మెంట్ అయ్యాక కావాలనే రహస్యంగా ఉంచినట్టు ఈ విషయాన్ని బయటపెట్టారు. (Siddharth)

Also Read: Akhil: అఖిల్ కి ప్రేమించిన అమ్మాయి దూరం అవ్వడానికి కారణం ఆ హీరో నేనా..?

అంతేకాదు పెళ్లి డేట్ ని కూడా త్వరలోనే బయట పెడతామని సిద్ధార్థ్ అదితి లు చెప్పారు. కానీ పెళ్లి తేదీని బయట పెట్టకుండానే రహస్యంగా ఈ జంట పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా వనపర్తి లోని శ్రీరంగాపురం రంగనాయక స్వామి ఆలయంలో సిద్ధార్థ్ అదితి రావు హైదరి లు ఇద్దరు కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇక సిద్ధార్థ్ అదితి లు పెళ్లి చేసుకున్న పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

 Secretly married Siddharth Aditi

ఇక ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజెన్స్, సెలబ్రిటీలు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక సిద్ధార్థ్ అదితి రావు హైదరి ఇద్దరు మహాసముద్రం సినిమా సమయంలో ప్రేమలో పడి అప్పటినుండి డేటింగ్ చేశారు. ఇక సిద్ధార్థ్ కి అదితి కంటే ముందే పెళ్లయింది. అలాగే అదితీ రావు హైదరీకి కూడా అంతకు ముందే పెళ్లయి విడాకులు అయ్యాయి. అలాగే శృతి హాసన్, సమంత వంటి హీరోయిన్లతో సిద్ధార్థ కి ఎఫైర్ వార్తలు కూడా వినిపించాయి.(Siddharth)