Virat Kohli: సెప్టెంబర్ 19వ తేదీ నుంచి బంగ్లాదేశ్ తో టీమ్ ఇండియా రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్ ఆడడానికి సిద్ధమవుతోంది. ఈ సిరీస్ కోసం పాత క్రికెటర్లు అందరూ సిద్ధమవుతున్నారు. ఈ సిరీస్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఆడనున్నాడు. చాలాకాలం తర్వాత విరాట్ కోహ్లీ మళ్ళీ టెస్ట్ ఫార్మాట్ లోకి రాబోతున్నాడు. కోహ్లీ ఈ సంవత్సరం ప్రారంభంలో దక్షిణాఫ్రికాతో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. Virat Kohli

Virat Kohli breaks Chepauk wall near India dressing room with destructive six

కాగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ కు ముందు విరాట్ మైదానం గోడను పగలగొట్టారు. ఆదివారం సెప్టెంబర్ 15 చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన భారత నెట్ సెషన్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో కనిపించాడు. కోహ్లీ నెట్ సెషన్ లో హైలైట్ ఏంటంటే…..భారత డ్రెస్సింగ్ రూమ్ సమీపంలోని గోడను విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. వాస్తవానికి ప్రాక్టీస్ సెక్షన్ లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ కొట్టిన షాట్లలో ఒకటి డ్రెస్సింగ్ రూమ్ కు సమీపంలో ఉన్న గోడకు తగిలింది. Virat Kohli

Also Read: Simi Singh: భార్య కాలేయంతో పున‌ర్జ‌న్మ‌.. కోలుకుంటున్న‌ క్రికెట‌ర్ ?

దాంతో విరాట్ దెబ్బకు డైరెక్ట్ గా వెళ్లి డ్రెస్సింగ్ రూమ్ గోడను ముక్కలు చేసింది. దీంతో సహచర ప్లేయర్లు షాక్ కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. వీటిని చూసిన చాలామంది అభిమానులు, నెటిజెన్లు బంగ్లాకు ఇక దబిడిదిబిడే, బంగ్లా పులులకు తిప్పలు తప్పవు అంటూ క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోను జియో సినిమా తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకుంది. Virat Kohli