Arvind Kejriwal: దేశ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. ప్రముఖ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. మద్యం కుంభకోణం కేసులో దాదాపు ఆరు నెలల పాటు జైల్లో ఉన్న కేజ్రీవాల్, శుక్రవారం విడుదలైన వెంటనే ఆదివారం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమై ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. తనపై ఉన్న అభియోగాలు నిరాధారమైనవని నిరూపించుకునేంత వరకు ముఖ్యమంత్రిగా కొనసాగబోనని, నిర్దోషి అని రుజువైన తర్వాతే తిరిగి బాధ్యతలు చేపడతానని వెల్లడించారు.

Arvind Kejriwal Resigns as Delhi Chief Minister

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కొత్త ముఖ్యమంత్రిని త్వరలోనే ఎన్నుకోనుందని కేజ్రీవాల్ తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆప్‌ను లక్ష్యంగా చేసుకుని పార్టీ నాయకులు సత్యేందర్ జైన్, అమానతుల్లా ఖాన్‌ వంటి ప్రముఖులు ఇంకా జైలులో ఉన్నారని, వారిని త్వరలో విడుదల చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.

Also Read: Jani Master: జానీ మాస్టర్ బాగోతం బయటపడడానికి కారణం ఆ హీరోనేనా!!

అంతేకాక, కేజ్రీవాల్ బీజేపీ ఎన్డీయేతర ముఖ్యమంత్రులను రాజకీయపరంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వంటి నేతలపై కేసులు పెట్టి వారిని పదవుల నుంచి తప్పించాలనే కుట్ర జరుగుతోందని అన్నారు. అయితే, తాను జైలులో ఉన్నప్పటికీ పరిపాలనను సుప్రీంకోర్టు అనుమతితో కొనసాగించానని తెలిపారు.

ఢిల్లీ ఎన్నికలు నవంబర్‌లో నిర్వహించాలని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు తన నిజాయితీని అంగీకరిస్తారనుకుంటున్నానని, గెలిస్తే ముఖ్యమంత్రి పదవిని తిరిగి చేపడతానని, లేకపోతే ప్రజల తీర్పును గౌరవిస్తానని స్పష్టం చేశారు.