Gayatri Gupta made shocking comments

Gayatri Gupta: గాయత్రి గుప్తా..ఈమె పేరు చెప్తే ఎక్కువగా తెలియకపోవచ్చు.కానీ సాయి పల్లవి వరుణ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన ఫిదా మూవీ లో సాయి పల్లవి ఫ్రెండ్ గా నటించిన అమ్మాయి అంటే అందరికీ ఇట్టే గుర్తుకు వస్తుంది.ఇక గాయత్రి గుప్తా కేవలం ఫిదా సినిమాలోనే కాకుండా ఐస్ క్రీమ్, మిఠాయి, కొబ్బరి మట్ట వంటి సినిమాల్లో కూడా నటించింది. అలాగే పలు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా చేసింది.

Gayatri Gupta made shocking comments

ఇక ఇవే కాకుండా కొన్ని షోలలో యాంకరింగ్ చేసి యాంకర్ గా మంచి పేరు తెచ్చుకుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మకి తెలుగు బిగ్ బాస్ షోలో అవకాశం వచ్చి అన్ని అగ్రిమెంట్లు తీసుకున్నాక చివరికి ఆమెని షోలోకి తీసుకోలేదనే ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు క్యాస్టింగ్ కౌచ్ విషయం లో కూడా పోరాటం చేసింది. అలాగే బిగ్ బాస్ ని బ్యాన్ చేయాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసే ప్రకంపనలను సృష్టించింది.(Gayatri Gupta)

Also Read: NTR: దేవర రిలీజ్ కి ముందే డైరెక్టర్ కి అద్భుత గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఖరీదు అన్ని కోట్లా.?

అయితే అలాంటి గాయత్రి గుప్తా కి ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ 8లోకి వెళ్లే అవకాశం వచ్చినప్పటికీ నో చెప్పిందట. ఇక రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో గాయత్రి గుప్తా మాట్లాడుతూ.. నాకు తెలుగులో అవకాశాలు తగ్గిన సమయంలో హిందీలో ఒక అవకాశం వచ్చింది.

Gayatri Gupta made shocking comments

అయితే ఆ ఆఫర్ కావాలంటే 12 రోజులు వారితో పడుకుంటే 10 లక్షలతో పాటు ఒక ఖరీదైన ఫ్లాట్,లగ్జరీ కారు ఇస్తామని ఆఫర్ చేశారట.దీంతో ఈ విషయం ఎవరికీ చెప్పాలో తెలియక అవకాశం వద్దు ఏం వద్దు అని తిరిగి హైదరాబాద్ కి వచ్చేసాను అంటూ సంచలన విషయాన్ని బయటపెట్టింది గాయత్రి గుప్తా. ప్రస్తుతం గాయత్రి మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.(Gayatri Gupta)