Balineni Srinivas: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. వైసిపి పార్టీకి వరుసగా నేతలందరూ రాజీనామా పెట్టి బయటకు… వెళ్లడం జరుగుతుంది. అలా ఇప్పటికే చాలామంది నేతలు.. బయట పడ్డారు. దొరబాబు, ఆళ్ల నాని, లాంటి కీలక నేతలు ఇప్పటికే వైసీపీ పార్టీని వీడారు. Balineni Srinivas
Srinivas Reddy resigns from YCP Will Srinivas Reddy join Janasena
అటు రాజ్యసభ ఎంపీలు మస్తాన్ రావు, మోపిదేవి లాంటి నేతలు… జగన్మోహన్ రెడ్డిని వీడారు. అయితే ఇలాంటి నేపథ్యంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా ప్రకటన కూడా చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని… కానీ ప్రస్తుతం పార్టీ వీడక తప్పదని తెలిపారు. Balineni Srinivas
Also Read: Delhi CM Atishi: ఢిల్లీ సీఎంగా ఆతిశీనే ఎందుకు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే ?
ఐదుసార్లు ప్రజాప్రతినిధిగా తాను గెలిచానని.. మంత్రిగా కూడా రెండుసార్లు… పనిచేసినట్లు గుర్తు చేసుకున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మారాల్సిన అవసరం వచ్చిందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా ఏ పార్టీ పనిచేసిన ఆ పార్టీని తాను… మెచ్చుకుంటానని కూడా తెలిపారు. అయితే ఇవాళ బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. పవన్ కళ్యాణ్ తో సమావేశం కానున్నారట. అనంతరం ఒక సభ నిర్వహించి జనసేన పార్టీలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. చేరే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. Balineni Srinivas