KTR: రాష్ట్రవ్యాప్తంగా రైతుల అక్రమ అరెస్టులపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు రుణమాఫీ హామీ అమలు చేయాలని “చలో ప్రజాభవన్‌”కు పోవడానికి చేసిన ప్రయత్నంలో వారిని అరెస్టు చేయడాన్ని ఖండించారు. ఆయన మాట్లాడుతూ, బుధవారం రాత్రి నుంచి రైతులను, రైతు సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం తీవ్ర దారుణమని అన్నారు. “రైతులు దొంగలేనా, ఉగ్రవాదులా?” అని ప్రశ్నించారు.

KTR Demands Unconditional Release of Farmers

గురువారం ఉదయం నుంచి రైతుల ఇళ్లకు వెళ్లి పోలీసులు నిర్బంధిస్తున్నారనే సమాచారం ఉందని, ఇది పూర్తిగా అప్రజాస్వామిక చర్య అని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ఈ ప్రవర్తనను ఆపాలని, అక్రమంగా అరెస్టు చేసిన రైతులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Also Read: Aditi Rao Hydari: ఆ హీరో కోసం మొదటి భర్తను వదిలేసిన అదితి రావు హైదరి.?

అరెస్టులతో రైతుల కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతులంటే ఎందుకు అంత భయం ఉందని కేటీఆర్‌ ప్రశ్నించారు. “రెండులక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి, రైతులను మోసం చేశారని” ఆయన అన్నారు.

ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని, ఇది పార్టీలకతీతంగా సాగుతుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాయమాటలు చెప్పడం కాకుండా, రైతుల సంస్థాగత శక్తికి తలవంచక తప్పదని కేటీఆర్‌ హెచ్చరించారు.